Sehari : బాలకృష్ణ వల్లే ఈ సినిమాకి హైప్ వచ్చింది..

తాజాగా 'సెహరి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో హీరో హర్ష మాట్లాడుతూ.. '' నేను కొన్ని షార్ట్‌ ఫిలింస్‌ చేశాను. కొన్ని సినిమాలకు ఆడిషన్స్‌కి వెళ్లినా.................

Sehari :  బాలకృష్ణ వల్లే ఈ సినిమాకి హైప్ వచ్చింది..

Balakrishna

Balakrishna :  హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘సెహరి’. ఈ సినిమా రెండు సంవత్సరాల క్రితం మొదలు పెట్టినా కరోనా వల్ల లేట్ అవుతూ వస్తుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. ‘సెహరి’ సినిమా ఫిబ్రవరి 11న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ఎంతో సందడి చేశాయి. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

‘సెహరి’ సినిమా చిన్న సినిమా అయినా లాస్ట్ ఇయర్ ఈ సినిమా పోస్టర్ లాంచ్ బాలకృష్ణతో చేయించారు. ఆ సమయంలో బాలకృష్ణ మాట్లాడిన స్పీచ్, హీరోతో కామెడీ చేయడం, మధ్యలో ఫోన్ వస్తే ఫోన్ విసరడం, హీరోయిన్ మీద పంచులు వేయడం చేశారు బాలయ్య బాబు. దీంతో ఆ పోస్టర్ లాంచ్ ఈవెంట్ బాగా వైరల్ అయింది. సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ అయింది. దీని గురించి హీరో ఇటీవల మళ్ళీ మాట్లాడాడు.

MTV Roadies : యాంకర్‌గా మారనున్న సోనూసూద్

తాజాగా ‘సెహరి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో హీరో హర్ష మాట్లాడుతూ.. ” నేను కొన్ని షార్ట్‌ ఫిలింస్‌ చేశాను. కొన్ని సినిమాలకు ఆడిషన్స్‌కి వెళ్లినా సెలక్ట్‌ కాలేదు. నిన్ను నువ్వే ప్రూవ్‌ చేసుకోవాలి అని నా స్నేహితులు చెప్పిన మాటలతో కసి పెరిగి హీరోగా ‘సెహరి’ చేశాను. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా ఇది. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటుంది. లాక్‌డౌన్‌ సమయంలో మా ‘సెహరి’ పోస్టర్‌ని హీరో బాలకృష్ణగారు విడుదల చేశారు. దాంతో మా సినిమా స్థాయి పెరిగింది. ఆయన వల్లే ఈ సినిమాకి హైప్ వచ్చింది. ఇందుకు ఆయనకు చాలా థ్యాంక్స్‌’’ అని తెలిపారు.