MTV Roadies : యాంకర్‌గా మారనున్న సోనూసూద్

తాజాగా ఓ షోకి యాంకర్ గా మారబోతున్నట్టు సోనూసూద్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తన సోషల్ మీడియాలో రోడ్ సైడ్ ఓ షాప్ లో సమోసా తింటూ ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో.................

MTV Roadies :  యాంకర్‌గా మారనున్న సోనూసూద్

Sonusood

Updated On : February 9, 2022 / 9:21 AM IST

Sonusood :  ఇటీవల అన్ని సినీ పరిశ్రమలలోనూ చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ బుల్లితెరపైకి, ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కొంతమంది హోస్ట్‌గా కూడా మారుతున్నారు. ఎన్టీఆర్‌, నాగార్జున, బాలకృష్ణ, సమంత, సల్మాన్ ఖాన్, కంగన రనౌత్‌.. లాంటి స్టార్స్ అంతా హోస్ట్‌గా మారి ప్రేక్షకులని అలరిస్తున్నారు. తాజాగా సోనూసూద్‌ కూడా ఈ జాబితాలోకి చేరనున్నారు.

కరోనా కాలంలో, ఆ తర్వాత కుండా ఎంతోమందికి సహాయం చేసి, ఎంతోమందికి ప్రాణదానం చేసి చాలామందికి ఆపద్బాంధవుడిగా మారారు సోనూసూద్. ఇప్పటికి కూడా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల సోనూసూద్ సోదరి రాజకీయాల్లోకి రావడంతో సోదరి కోసం ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. తాజాగా ఓ షోకి యాంకర్ గా మారబోతున్నట్టు సోనూసూద్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

Shanmukh Jaswanth : కొత్త ఇల్లు కొన్న షణ్ముఖ్ జస్వంత్

తన సోషల్ మీడియాలో రోడ్ సైడ్ ఓ షాప్ లో సమోసా తింటూ ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో.. ”త్వరలో మీ అందరికీ ఫన్‌, మస్తీ అందించేందుకు అడ్వెంచరస్‌ షోతో మీ ముందుకు వచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. రోడీస్ కొత్త సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరించనున్నాను. నా జీవితంలో ఇది ఒక కొత్త అడ్వెంచర్‌’’ అని తెలిపారు. హిందీ ఛానల్ Mటీవీలో ఈ షో త్వరలో మొదలవ్వనుంది.

View this post on Instagram

A post shared by Sonu Sood (@sonu_sood)