MAA : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై సీనియర్ నటుడు నరేష్ వ్యాఖ్యలు

తాజాగా ఇవాళ ఉదయం నరేష్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మా గురించి మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఎంతో చేసాను. సినిమా బిడ్డగా 24 క్రాఫ్ట్డ్స్ కు అండగా ఉంటాను. అందరికి...

MAA : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై సీనియర్ నటుడు నరేష్ వ్యాఖ్యలు

Naresh :  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల టైంలో ఎంత రచ్చ జరిగిందో మనందరికీ తెలిసిందే. దాదాపు రెండు నెలలపాటు ‘మా’ ఎన్నికలు వార్తల్లో నిలిచాయి. వీటిలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయింది సీనియర్ నటుడు నరేష్. మంచు విష్ణు వెనక ఉండి అంతా తానై నడిపించాడు. నరేష్ పై కూడా చాలా మంది విమర్శలు చేశారు. నరేష్ ని టార్గెట్ చేసి సినీ ప్రముఖులు చాలా మంది విమర్శలు గుప్పించారు ‘మా’ ఎన్నికల టైంలో. నరేష్ కూడా వాటన్నిటికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

తాజాగా ఇవాళ ఉదయం నరేష్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మా గురించి మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం ఎంతో చేసాను. సినిమా బిడ్డగా 24 క్రాఫ్ట్డ్స్ కు అండగా ఉంటాను. అందరికి ఫ్రీ ఇన్సూరెన్స్ వచ్చేలా చేస్తున్నాను. ‘మా’ అనేది ఛాంబర్ లో భాగం. మంచు విష్ణు ఒక్కరే కాదు అందరూ ఇన్వాల్ అవుతారు. నేను ‘మా’ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి విష్ణుతో కలసి పని చేస్తూన్నాను. నేను ఈ ఎన్నికల తర్వాత ‘మా’ ఆఫీసుకు ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. జీవిత చేసిన ఆరోపణలు కరెక్ట్ కావు. ‘మా’ ఆఫీసులో సీసీ కెమెరాలు చూస్తే తెలుస్తుంది.మా బిల్డింగ్ పై మంచు విష్ణు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాడు” అని తెలిపారు.

Jyothi Reddy Death : నా బిడ్డ మృతిపై అనుమానాలున్నాయ్ : జూ.ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి తండ్రి

ఇక సినీ సమస్యలపై ప్రభుత్వాలతో సినీ పెద్దలు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఈ విషయంపై కూడా స్పందించారు. నరేష్ సినీ సమస్యలపై మాట్లాడుతూ.. ”సినీ పరిశ్రమ ప్రస్తుతం లాస్ లో ఉంది. సినీ పెద్దలు అందరూ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారు. సినీ ఇండస్ట్రీ సమస్యలు త్వరలోనే పరిస్కరం అవుతాయి. పరిశ్రమ, ప్రభుత్వం రెండూ కలసి పని చేస్తాయి. రానున్న రోజుల్లో సినీ రంగంలోని అనేక సమస్యలపై పనిచేస్తాను” అని తెలిపారు.