Jyothi Reddy Death : నా బిడ్డ మృతిపై అనుమానాలున్నాయ్ : జూ.ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి తండ్రి

జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి తండ్రి పవుల్ రెడ్డి మాట్లాడుతూ.. ''సంక్రాంతికి అని జ్యోతి ఇంటికి వచ్చింది. మూడు రోజులు ఉండి హైదరాబాద్ కు బయలుదేరింది. నిన్న సాయంత్రం మాకు జ్యోతి.....

Jyothi Reddy Death : నా బిడ్డ మృతిపై అనుమానాలున్నాయ్ : జూ.ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి తండ్రి

Jyothi Reddy

Jyothi Reddy Death :  నిన్న మంగళవారం ఉదయం రైలు ప్రమాదంలో జూనియర్‌ ఆర్టిస్టు జ్యోతిరెడ్డి అనే యువతి మృతి చెందింది. షాద్‌నగర్‌ స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీలోని కడప జిల్లా చిట్వేన్‌ మండలానికి చెందిన బట్టినపాత జ్యోతి హైదరాబాద్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగిగా చేస్తుంది. దానితో పాటు సినిమాల్లోకి రావాలని జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

కేసు నమోదు చేసుకున్న పోలీసుల కథనం ప్రకారం.. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామానికి వెళ్లిన జ్యోతిరెడ్డి సోమవారం రాత్రి తిరుగు పయనమైంది. చిత్తూరు నుంచి కాచిగూడ వస్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఆమె రైల్వేకోడూరులో ఎక్కి హైదరాబాద్‌కు బయలుదేరింది. రైలు మంగళవారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో షాద్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో ఆగింది. నిద్రమత్తులో ఉన్న జ్యోతిరెడ్డి కాచిగూడ రైల్వేస్టేషన్‌ అనుకొని షాద్‌నగర్‌ స్టేషన్‌లో దిగింది. అయితే వెంటనే తిరిగి రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా అప్పటికే రైలు కదులుతుండటంతో ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫాంపై పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. రైల్వే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే జ్యోతిరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

అయితే ఈ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేశారు. మృతుదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ నుంచి ఉస్మానియాకి తరలిస్తుండగా అడ్డుకొని ఆందోళనలు చేశారు. తాజాగా ఈ విషయంపై జ్యోతిరెడ్డి తండ్రి 10 టీవీతో మాట్లాడారు.

Unstoppable with NBK : బాలయ్యని ఒక్క ఛాన్స్ అడిగిన వర్మ

జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి తండ్రి పవుల్ రెడ్డి మాట్లాడుతూ.. ”సంక్రాంతికి అని జ్యోతి ఇంటికి వచ్చింది. మూడు రోజులు ఉండి హైదరాబాద్ కు బయలుదేరింది. నిన్న సాయంత్రం మాకు జ్యోతి మృతి చెందింది అని కాల్ వచ్చింది. షాద్ నగర్ రైల్వేస్టేషన్ లో ఈ ఘటన జరిందని జ్యోతి స్నేహితులు తెలిపారు. రైలు ఎక్కుతుండగా కింద పడి మృతి చెందిందని రైల్వే పోలీసులు అంటున్నారు. నా కూతురు జూనియర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో చేసింది. ఇటీవలే ‘పుష్ప’ సినిమాలో డాన్స్ కూడా చేసింది. తన కూతురుతో చివరిగా జాగ్రత్త అని చెప్పాను. ఇంతలోనే చావు వార్త వినాల్సి వచ్చింది” అంటూ ఎమోషనల్ అయ్యారు.

Jyothi Reddy : జూనియర్ ఆర్టిస్ట్ మృతి.. ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన

అయితే పోలీసుల చెప్పిన కథనాన్ని వ్యతిరేకిస్తూ.. పోలీసులు షాద్ నగర్ లో కాచిగూడ స్టేషన్ అనుకోని రైల్ ఆగడంతో రైల్ దిగిందని, కానీ కాచిగూడ కాదని తెలుసుకొని మళ్లీ రైలు ఎక్కే ప్రయత్నం చేసిందని, అప్పటికే రైలు కదలడంతో జ్యోతి రైల్ ఎక్కే క్రమంలో కింద పడిపోయి తీవ్ర గాయాలై హాస్పిటల్ కి తీసుకెళ్తుంటే చనిపోయిందని చెప్పారు. జ్యోతి మృతిపై మాకు అనుమానాలున్నాయి. ట్రైన్ లో నుంచి ఎవరన్నా తోసేసారా లేక తనే పడిపోయిందా మాకు తెలియాలి. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాము. తమకు న్యాయం చేయాలని హాస్పిటల్ వద్ద మేము, జ్యోతి స్నేహితులు కొంతమంది జూనియర్ ఆర్టిస్ట్ లు, డ్యాన్సర్ లు ఆందోళన చేసాము” అని తెలిపారు.