Jaggareddy: జగ్గారెడ్డిని బుజ్జగించిన వీహెచ్

టీ-కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న వివాదంపై సీనియర్ నేతలు సర్దుబాటుచర్యలకు దిగారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం

Jaggareddy:  జగ్గారెడ్డిని బుజ్జగించిన వీహెచ్

Jagga

Jaggareddy: గత కొన్ని రోజులుగా టీ-కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న వివాదంపై సీనియర్ నేతలు సర్దుబాటు చర్యలకు దిగారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై.. ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పార్టీలో నా తీరు నచ్చకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని ఇటీవల జరిగిన పీఏసీ సమావేశంలో చెప్పిన జగ్గారెడ్డి, పలు విషయాలపై పార్టీలోని ముఖ్యనాయకులతో విభేదిస్తున్నారు. ఈక్రమంలో జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు రంగంలోకి దిగారు. గురువారం హైదరాబాద్ లోని జగ్గారెడ్డి నివాసానికి వెళ్లిన వీహెచ్, ప్రస్తుతం కాంగ్రెస్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారు.

Also read: Crime News: వృద్ధుడిని హతమార్చిన మరో వృద్ధుడు

సొంత నియోజకవర్గం సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ పెట్టించి.. విజయవంతం చేసిన జగ్గారెడ్డి లాంటి వారు కాంగ్రెస్ పార్టీకి అవసరం అన్న వీహెచ్, రాజీనామా ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. సమస్య ఏదైనా కలిసి పనిచేద్దామని జగ్గారెడ్డికి సూచించిన విహెచ్..రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని అన్నారు. ఇక టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యహారాల ఇన్ఛార్ మాణిక్యం ఠాకూర్ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి..పార్టీలో తనకు వ్యక్తిగతంగా ఎదురవుతున్న సమస్యలను సేరో నేత వీహెచ్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన వీహెచ్.. అధిష్టానంతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు.

Also read: Somireddy Chandramohan: అమరావతి భూముల్ని తాకట్టు పెట్టేందుకే కార్పొరేషన్ ఏర్పాటు