Somireddy Chandramohan: అమరావతి భూముల్ని తాకట్టు పెట్టేందుకే కార్పొరేషన్ ఏర్పాటు

రాష్ట్ర రాజధానిని 29 గ్రామాల పరిధి నుంచి 19 గ్రామాలకు పరిమితం చేసేందుకే సీఎం జగన్ అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.

Somireddy Chandramohan: అమరావతి భూముల్ని తాకట్టు పెట్టేందుకే కార్పొరేషన్ ఏర్పాటు

Somireddy

Somireddy Chandramohan: నాడు టీడీపీ హయాంలో స్మశానం, గ్రాఫిక్స్ అని తిట్టిన వైసీపీ నేతలు.., నేడు రూ. 2 లక్షల కోట్ల పైబడిన అమరావతి భూముల్ని తాకట్టు పెట్టేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం గుంటూరు జిల్లా అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రాజధానిని 29 గ్రామాల పరిధి నుంచి 19 గ్రామాలకు పరిమితం చేసేందుకే సీఎం జగన్ అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.

Also Read: New Scam unearthed: JEE, GMAT ప్రవేశ పరీక్షల్లో వెలుగు చూసిన భారీ కుంభకోణం

కార్పొరేషన్ పేరులోనే క్యాపిటల్ సిటీ అని పేర్కొని కొత్త కుట్రకు తెరలేపారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అమరావతి పరిధిలో ఎకరా రూ.7 కోట్లు విలువ చేస్తుందని చెప్తూ, 480 ఎకరాల తాకట్టుకు వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేసిందన్న సోమిరెడ్డి..రైతులు త్యాగం చేసిన 34 వేల ఎకరాల భూమి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తేనే రూ.2లక్షల కోట్ల పైబడి ఉంటుందని పేర్కొన్నారు. రాజధాని పరిధిలో ఎలా ముందుకెళ్లాలన్నా తమ అనుమతి తీసుకోవాలన్న న్యాయస్థానం ఆదేశాలను ప్రభుత్వం ఎలా ఉల్లంఘిస్తుందని చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. న్యాయస్థానం అనుమతి తీసుకుని రైతులు కోరుకుంటున్నట్లు 29 గ్రామాలను ఒకే కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.

Also read: Corona in China: చైనాలో అదుపులోకి వస్తున్న కరోనా

రైతుల సమస్యలు పరిష్కరించకుండా, వారికి న్యాయం చేయకుండా.. వారు త్యాగం చేసిన భూములపై జగన్ రెడ్డి కన్నుపడటం దుర్మార్గమని చంద్రమోహన్ రెడ్డి దుయ్యబట్టారు. రైతులు పండించే అన్నం తింటున్న సీఎం జగన్, పాలన చేతకాక చివరకు రైతులనే మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆక్షేపించారు. అమరావతి కార్పొరేషన్ ఏర్పాటును ప్రజలు వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారని కావునా ప్రభుత్వం వెనక్కు తగ్గితే మంచిదని చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు.

Also read: Great Resigns: అమెరికాలో ఒక్క నెలలో 45 లక్షల మంది ఉద్యోగులు రాజీనామా, ఇది అసలు విషయం