New Scam unearthed: JEE, GMAT ప్రవేశ పరీక్షల్లో వెలుగు చూసిన భారీ కుంభకోణం

ఎక్జామ్స్ లో హైటెక్ మోసానికి పాల్పడుతున్న ఆరుగురు ముఠాసభ్యులను. ఢిల్లీపోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు

New Scam unearthed: JEE, GMAT ప్రవేశ పరీక్షల్లో వెలుగు చూసిన భారీ కుంభకోణం

Crime

New Scam unearthed: ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల కొరకు నిర్వహించే పలు ప్రవేశ పరీక్షలలో కొందరు అభ్యర్థులు భారీ మోసానికి పాల్పడ్డట్లు ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. ఈమేరకు ఎక్జామ్స్ లో హైటెక్ మోసానికి పాల్పడుతున్న ఆరుగురు ముఠాసభ్యులను.. ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ మరియు స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈముఠా సభ్యులు ముంబై, ఢిల్లీ, రాజస్థాన్ లో పలు విభాగాలు ఏర్పాటు చేసి, రష్యా హ్యాకర్ల సహాయంతో ఈ భారీ మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో నిఘా వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. గత ఆరు నెలలుగా ఈముఠా కార్యకలాపాలపై నిఘా ఉంచిన IFSO అధికారులు.. ఆమేరకు ముఠాలో కీలక సభ్యుడిగా పేర్కొన్న రాజ్ టియోటియా సహా మరో ఐదుగురిని బుధవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read: Corona in China: చైనాలో అదుపులోకి వస్తున్న కరోనా

వీరిలో హర్యాణాకు చెందిన రాజ్ టియోటియా గత ఐదేళ్లుగా ఇటువంటి మోసాలకు పాలపడుతున్నట్లు గుర్తించిన అధికారులు..ఇతనిపై సీబీఐ కేసు సహా మరో నాలుగు కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఐదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్నా టియోటియాపై హర్యాణా ప్రభుత్వం రూ.1 లక్ష రివార్డ్ సైతం ప్రకటించింది. రాజ్ టియోటియా మరికొందరి సహకారంతో గత రెండు సంవత్సరాలుగా ఈతాజా స్కాంను నడిపిస్తున్నట్లు సమాచారం. JEE, GMAT, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ, Cisco, IBM సర్టిఫికేషన్స్ సహా IELTS, TOEFL వంటి ఇతర ముఖ్య ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని భావించిన సుమారు 450 మంది ఆశావహులకు..ఈముఠా సభ్యులు సహాయం చేసారు. 450 మంది అభ్యర్థుల నుంచి ఆయా పరీక్షలకు గానూ.. కనిష్టంగా రూ.3 లక్షలు, గరిష్టంగా రూ.15 లక్షలు వసూలు చేశారు.

Also Read: Great Resigns: అమెరికాలో ఒక్క నెలలో 45 లక్షల మంది ఉద్యోగులు రాజీనామా, ఇది అసలు విషయం

రష్యాకు చెందిన కొందరు హ్యాకర్లతో సంబంధాలున్న రాజ్ టియోటియా.. లాక్ డౌన్ సమయంలో రష్యా హ్యాకర్లకు రాజ్ టియోటియా భారత్ లో ఆశ్రయం కల్పించి మరీ ఈ మోసానికి పాల్పడినట్లు ఢిల్లీ డీసీపీ మల్హోత్రా పేర్కొన్నారు. లాక్ డౌన్ సమయంలో ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన ఆయా ప్రవేశ పరీక్షలను హ్యాక్ చేసేందుకు నిఘావర్గాలకు చిక్కకుండా ముంబై, ఢిల్లీ, రాజస్థాన్ ప్రాంతాల్లో విభాగాలు ఏర్పాటు చేసారు. వీటిలో ముంబై విభాగంలోని ముఠా సభ్యులు.. పరీక్షలో పాల్గొనే అభ్యర్థులతో సంప్రదింపులు జరిపేవారు. అభ్యర్థుల పరీక్ష వివరాలు, పేమెంట్ వంటి విషయాలు ఈముఠా చూసుకునేది. రాజస్థాన్ ముఠాసభ్యులు కంప్యూటర్లను హ్యాక్ చేసేవారు. అభ్యర్థులు ఏ పరీక్షకు హాజరు అవుతున్నారు, వారి క్వశ్చన్ పేపర్లు ఎలా ఉంటాయి, కంప్యూటర్లు ఎలా ఉండాలి అనే విషయం పై వీరు దృష్టి పెట్టేవారు. ఇక ఢిల్లీ ముఠాసభ్యులు పరీక్షను రాసేవారు. అభ్యర్థుల పరీక్షను బట్టి ఆయా ప్రశ్నలకు ఈముఠా సభ్యులు సమాధానాలు రాసేవారు.

Also read: Road Accident: ఇస్నాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఈ స్కాంను బయటపెట్టారు ఢిల్లీ పోలీసులు. ముందుగా ఒక కానిస్టేబుల్ ను పరీక్ష రాసే అభ్యర్థిగా ముఠాసభ్యులకు పరిచయం చేశారు. అనంతరం ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆ కానిస్టేబుల్ ముఠా వ్యవహారాలను రాబట్టాడు. కానిస్టేబుల్ ద్వారా పక్కాగా ఆధారాలు రాబట్టిన పోలీసులు.. రాజ్ టియోటియా సహా ముంబైకి చెందిన అర్షద్ దున్నా (39), సల్మాన్ దున్నా (28), హేమల్ షా (42)లతో పాటు ఢిల్లీకి చెందిన కునాల్ గోయెల్ (39), మోహిత్ శర్మ (35)లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి అక్రమ సహాయం పొందిన 450 మంది అభ్యర్థుల వివరాలను రాబట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు ఢిల్లీ IFSO అధికారులు.

Also read: Corona Rising: ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఓమిక్రాన్, ఆంక్షల దిశగా పలు దేశాలు