Corona Rising: ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఓమిక్రాన్, ఆంక్షల దిశగా పలు దేశాలు

అగ్ర రాజ్యం అమెరికాలో నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. యూరోప్ లోనూ..ఓమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపుతుంది.

Corona Rising: ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఓమిక్రాన్, ఆంక్షల దిశగా పలు దేశాలు

Corona

Corona Rising: ప్రపంచంపై కరోనా మహమ్మారి పీడ కొనసాగుతుంది. కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తుంది. అగ్ర రాజ్యం అమెరికాలో నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. యూరోప్ లోనూ..ఓమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపుతుంది. వివిధ దేశాల్లో ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈక్రమంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పలు దేశాలు తిరిగి ఆంక్షలు విధిస్తున్నాయి. అమెరికాలో ఒక్కరోజే 8 లక్షల 80 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు కాగా వాటిలో 90 శాతం మంది ఓమిక్రాన్ బాధితులు ఉన్నారు. కరోనా భారిన పడ్డ వారిలో 20 శాతం మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. బాధితులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఏర్పడింది.

Also Read: Costly Fish: ఒక చేప విలువ రూ.1 కోటీ 8 లక్షల? జపాన్ లో ఎందుకంత రేటు

యూరోప్ లోనూ కరోనా విలయతాండవం చేస్తుంది. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ సహా ఇతర దేశాల్లో లక్షల సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఫ్రాన్స్ లో 2 లక్షల 64 వేల కేసులు నమోదు అయ్యాయి. ఇటీలలో 1 లక్షా 70 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా నమోదు అవుతున్న కేసుల్లో అత్యధిక శాతం ఓమిక్రాన్ బాధితులు ఉన్నట్లు ఆయా దేశాల అధికారులు వెల్లడించారు. ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ప్రభుత్వాలు.. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంక్షలు విధించారు. ఇక తమ దేశంలో ఒక్కొక్కరికి నాలుగు డోసుల కరోనా వాక్సిన్ అందించిన ఇజ్రాయెల్ లోనూ.. కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనాను ఎదుర్కొనేందుకు ఆదేశ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కరోనా మళ్లీ ప్రతాపం చూపిస్తుండడంతో పలు దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి

Also read: Civils Main Exams : సివిల్స్ మెయిన్ పరీక్ష యథాతధం