Corona in China: చైనాలో అదుపులోకి వస్తున్న కరోనా

కరోనా కొత్త వేరియంట్ లు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంటే.. చైనాలో మాత్రం కరోనా తగ్గుముఖం పడుతుంది.

Corona in China: చైనాలో అదుపులోకి వస్తున్న కరోనా

Corona

Corona in China: కరోనా కొత్త వేరియంట్ లు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంటే.. చైనాలో మాత్రం కరోనా తగ్గుముఖం పడుతుంది. కరోనా పుట్టినిల్లుగా చెప్పుకుంటున్న చైనాలో.. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. 2021 మార్చి నుంచి “జీరో కరోనా కేసు” పాలసీతో ముందుకు వెళ్తున్న అధికారులు ఆదిశగా పురోగతి సాధిస్తున్నారు. తాజాగా గ్జియాన్ నగరంలో కరోనా కేసుల పెరుగుదలకు అడ్డుకట్ట వేయడమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ బయటపడిన నేపథ్యంలో డిసెంబర్ 2021 నుంచి అన్ని దేశాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.

Also read: Great Resigns: అమెరికాలో ఒక్క నెలలో 45 లక్షల మంది ఉద్యోగులు రాజీనామా, ఇది అసలు విషయం

చైనాలోని గ్జియాన్ నగరంలోనూ కరోనా కేసుల రోజువారీ సంఖ్య పెరగసాగింది. దీంతో అప్రమత్తమైన అక్కడి అధికారులు.. రెండు వారాల పాటు గ్జియాన్ నగరంలో కఠిన లాక్ డౌన్ అమలు చేసారు. మొత్తం 1 కోటి 30 లక్షల మంది జనాభా ఉన్న గ్జియాన్ నగరంలో కఠిన లాక్ డౌన్ విధించారు. ఒక్కొకొక్క కరోనా కేసును పరిగణలోకి తీసుకుని వారి కాంటాక్టులని సైతం క్వారంటైన్ కు తరలించారు. దీంతో డిసెంబర్ రెండో వారంలో ఒక్కరోజు గరిష్టంగా(1800కేసులు) ఉన్న కేసుల సంఖ్య జనవరి మొదటి వారానికి 35కి దిగొచ్చింది. అధికారుల ముందస్తు చర్యలు, పకడ్బందీగా కరోనా ఆంక్షలు అమలు చేయడంతోనే ఇదంతా సాధ్యమైందంటూ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Also read: Road Accident: ఇస్నాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

మరోవైపు నగరంలో లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్లిన ఒక గర్భిణీని, కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ లేదంటూ ఆసుపత్రిలో చేరుకునేందుకు నిరాకరించారు వైద్యులు. దీంతో చికిత్స ఆలస్యమై ఆసుపత్రి వరండాలోనే ఆమె కుప్పకూలిపోయింది. అనంతరం ఆమెకు డెలివరీ చేసిన వైద్యులు పుట్టిన బిడ్డ మృతి చెందినట్లు ప్రకటించారు. చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యలు ప్రజల ప్రాణాలమీదకు తెస్తుందంటూ అంతర్జాతీయ మీడియా ఆందోళన వ్యక్తం చేసింది.

Also read: Corona Rising: ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఓమిక్రాన్, ఆంక్షల దిశగా పలు దేశాలు