Great Resigns: అమెరికాలో ఒక్క నెలలో 45 లక్షల మంది ఉద్యోగులు రాజీనామా, ఇది అసలు విషయం

అగ్ర రాజ్యం అమెరికాలో "గ్రేట్ రిజైన్" కొనసాగుతుంది. కరోనా కారణంగా 2020 నుంచి లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు

Great Resigns: అమెరికాలో ఒక్క నెలలో 45 లక్షల మంది ఉద్యోగులు రాజీనామా, ఇది అసలు విషయం

Resigns

Great Resigns: అగ్ర రాజ్యం అమెరికాలో “గ్రేట్ రిజైన్” కొనసాగుతుంది. కరోనా కారణంగా 2020 నుంచి లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. అయితే 2021 మధ్య నాటికి రాజీనామా చేసే వారి సంఖ్య తారాస్థాయికి చేరుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. ఒక్క 2021 నవంబర్ నెలలోనే 45 లక్షల మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామాలతో సంస్థలు తలలు పట్టుకుంటున్నాయి. ప్రధానంగా పర్యాటక-హోటల్, సూపర్ మార్కెట్లు-రవాణా, ఆసుపత్రులు ఆరోగ్యశాఖల్లోని ఉద్యోగులు రాజీనామాలు సమర్పించారు. ఈస్థాయిలో ఉద్యోగులు రాజీనామా చేసేందుకు ప్రధాన కారణం.. యజమానులు తమను వాడుకుని వదిలేస్తున్నారంటూ కొందరంటుంటే..పనిచేసే చోట తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని మరికొందరు భావిస్తున్నారు.

Also read: Road Accident: ఇస్నాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

అయితే ఇది కూడా ఒకందుకు మంచిదే అని అంటున్నారు అక్కడి లేబర్ మార్కెట్ విశ్లేషకులు. “ఉన్న ఉద్యోగం వదిలి కొత్త ఉద్యోగం కోసం వెళ్తే ఇబ్బంది లేదు.. కానీ ఉద్యోగమే లేదంటే నిజంగానే సమస్య ఉన్నట్లు. ఒకరు వదిలి వెళ్లిన ఖాళీని.. అవసరం ఉన్న మరొకరు భర్తీ చేస్తారు. తద్వారా అందరికి ఉద్యోగ అవకాశం లభించినట్లు అవుతుంది” అంటూ అమెరికా ఆర్ధికవేత్త ఒకరు పేర్కొన్నారు.

కరోనా కారణంగా 2020 మార్చి – ఏప్రిల్ మధ్యలో 2 కోట్ల 20 లక్షల మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. దీంతో అమెరికాలో నిరుద్యోగ రేటు 14.8 శాతానికి పెరిగింది. అయితే కరోనా వాక్సిన్ లో వేగం పుంజుకోవడంతో ఉద్యోగులు తిరిగి పనుల్లో చేరిపోయారు. దీంతో 2021 చివరినాటికి నిరుద్యోగ శాతం 4.21 శాతంగా ఉన్నట్లు అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలో 1 కోటి 60 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉండగా.. సుమారు 70 లక్షల మంది మాత్రమే నిరుద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగాలు చేసేందుకు ఉద్యోగులు సుముఖంగా ఉన్నట్లు లేదు. తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని కొందరు భావిస్తుంటే.. కుటుంబం మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడంలేదంటూ మరికొందరు వెనకడుగు వేస్తున్నారట. బాగా చదువుకున్న కొందరు.. ఇంకా ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగాల కోసం వెళ్తుంటే.. మరికొందరు సొంత వ్యాపారాలు, మంచి సంస్థల్లో చేరేందుకు ఇష్టపడుతున్నారు

Also read: Corona Rising: ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఓమిక్రాన్, ఆంక్షల దిశగా పలు దేశాలు