NTR 100 Years : బాలకృష్ణ పెళ్ళికి వెళ్లని ఎన్టీఆర్.. రీజన్ ఏంటో తెలుసా?

ఎన్టీఆర్ కొడుకులు అయిన బాలకృష్ణ, రామకృష్ణ పెళ్లి ఒకేసారి జరిగింది. ఇద్దరి కొడుకులు పెళ్లి జరుగుతున్నా ఎన్టీఆర్ హాజరుకాకపోడానికి గల రీజన్ ఏంటో తెలుసా?

NTR 100 Years : బాలకృష్ణ పెళ్ళికి వెళ్లని ఎన్టీఆర్.. రీజన్ ఏంటో తెలుసా?

Senior ntr did not attend his son balakrishna marriage

NTR 100 Years : నందమూరి తారక రామారావు తెలుగునాటు మహానటుడిగానే, మహానాయకుడిగా కూడా ఎంతో కీర్తిప్రతిష్టలు అందుకున్నారు. నటుడిగా ఎన్నో పాత్రలు వేసి దేశంలో తెలుగు వారికి ఒక గుర్తింపుని తీసుకు వచ్చారు. అదే తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం తెలుగుదేశం పార్టీ (TDP) స్థాపించి ప్రజా సేవకి సమర శంఖం పూరించారు. నాయకుడిగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సీఎంగా కాకుండా తెలుగు వారి సేవకుడిగా పని చేశారు. ఈ క్రమంలో తన సొంత కుటుంబం కంటే ప్రజలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.

NTR 100 Years : ఎన్టీఆర్ శివుడి వేషం.. నాగుపామే వచ్చి మెడకి చుట్టుకున్న కథ తెలుసా?

ఎన్టీఆర్ కి మొత్తం 12 మంది సంతానం. వారిలో 8 మంది కొడుకులు, 4 కూతుళ్లు. ఇక ఎన్టీఆర్ కి 6, 7 సంతానంగా పుట్టిన వారే బాలకృష్ణ (Balakrishna), రామకృష్ణ. కాగా వీరిద్దరికి ఒకేసారి పెళ్లి అయ్యింది. 1982 లో డిసెంబర్ 8న తిరుపతిలో వీరి వివాహం జరిగింది. అయితే ఈ వివాహానికి ఎన్టీఆర్ హాజరుకాలేదట. ఇద్దరు కుమారుల పెళ్లి జరుగుతున్నా ఎన్టీఆర్ హాజరుకాకపోడానికి గల రీజన్ ఏంటని ఆలోచిస్తున్నారా? అదే ప్రజా యాత్ర. ప్రజలు సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్రమంతటా ఎన్టీఆర్ కాంపెయిన్ చేస్తున్న సమయంలో బాలకృష్ణ, రామకృష్ణ పెళ్లి జరిగింది.

NTR 100 Years : ఎన్టీఆర్‌తో చిరంజీవి సినిమా.. రాజకీయాల్లోకి రావడానికి 2 ఏళ్ళ ముందు..

పెళ్ళికి వెళితే యాత్రకి విరామం ఇవ్వాల్సి వస్తుందని ఎన్టీఆర్ పెళ్ళికి వెళ్లడం మానేశారట. ఇక తిరుపతి పెళ్లి చేసుకున్న బాలకృష్ణ, రామకృష్ణ.. యాత్రలో ఉన్న ఎన్టీఆర్ దగ్గరకి వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారట. ఈ విషయాన్ని ఇటీవల ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా జరిగిన ఒక కార్యక్రమంలో నటుడు మురళీ మోహన్ తెలియజేశాడు. కాగా గత ఏడాది మే 28 నుంచే ‘శకపురుషుని శత జయంతి ఉత్సవాలు’ అంటూ సంవత్సరాది వేడుకలను బాలకృష్ణ (Balakrishna) మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా శత జయంతి అంకురార్పణ సభని కూడా చాలా ఘనంగా నిర్వహించారు.