NTR 100 Years : ఎన్టీఆర్ శివుడి వేషం.. నాగుపామే వచ్చి మెడకి చుట్టుకున్న కథ తెలుసా?

తెలుగు వారికి ఎన్టీఆర్ అంటే ముందు గుర్తుకు వచ్చేది పౌరాణిక పాత్రలే. అయితే ఎన్టీఆర్ శివుడు పాత్ర వేసినప్పుడు జరిగిన ఒక ఆసక్తికర కథ గురించి తెలుసుకోవాలని ఉందా?

NTR 100 Years : ఎన్టీఆర్ శివుడి వేషం.. నాగుపామే వచ్చి మెడకి చుట్టుకున్న కథ తెలుసా?

Senior NTR plays Lord Shiva character and Ashwini Dutt shares snake story

NTR 100 Years : నందమూరి తారక రామారావు గురించి తెలుగు వారిని అడిగితే.. ఆయన రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, రావణాసురుడు, శివుడు అని చెబుతారు. ఎందుకంటే ఆయనని నటిస్తే ప్రేక్షకులకు ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఆ పాత్రని పోషించే ఎన్టీఆర్ కాదు. తెలుగు తెర పై పౌరాణిక పాత్రలు అంటే గుర్తుకు వచ్చే నటులు చాలా తక్కువమందే ఉన్నారు. వారిలో ఎన్టీఆర్ పేరు ముందు వరుసలోనే ఉంటుంది. అయితే ఒక సినిమా కోసం ఎన్టీఆర్ శివుడు వేషం వేసినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగిందట.

NTR 100 Years : ఎన్టీఆర్ 40 ఏళ్ళ వయసులో కూచిపూడి నేర్చుకున్నారు.. ఏ సినిమా కోసమో తెలుసా?

సి అశ్వినీ దత్ నిర్మాణంలో లెజెండరీ డైరెక్టర్ కె వి రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ శివుడి పాత్రలో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఆ సినిమాకి మరో స్టార్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నారు. శివుడి పాత్ర అంటే మెడలో నాగుపాము ఉండాల్సిందేగా, అందుకోసం అప్పటిలో కొందరు రబ్బర్ పాములను వాడేవారు. మరికొందరు కోరలు తీసేసిన నిజం పాములతోనే షూటింగ్ చేసేవారు. రబ్బర్ పాము మెడలో వేసుకుంటే ఎన్టీఆర్ కి ఎలర్జీ వస్తుండడంతో కోరలు తీసేసిన నిజం పామునే షూటింగ్ ఉపయోగించారు.

NTR 100 Years : ఎన్టీఆర్‌తో చిరంజీవి సినిమా.. రాజకీయాల్లోకి రావడానికి 2 ఏళ్ళ ముందు..

అయితే సీన్ కి ముందు పాములను ఆడించే వ్యక్తి పాముకి ట్రైనింగ్ లాంటిది ఇస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే పాముకి ట్రైనింగ్ ఇస్తుంటే ఎన్టీఆర్ ఏమి చేస్తున్నారు అని అడిగారట. పాము మెడలో ఉండేలా ట్రైనింగ్ ఇస్తున్నాడని సింగీతం శ్రీనివాస్ చెప్పారట. దానికి ఎన్టీఆర్ బదులిస్తూ.. “ఏమి అవసరం లేదు. వారిని వదిలేయండి. ఆయనే వస్తారు మెడలోకి” అని చెప్పారట. అది విన్న కె వి రెడ్డి.. “ఆయనికి బ్రెయిన్ ఉందని, పాముకి బ్రెయిన్ ఉంటదని అనుకుంటున్నాడా” అని వ్యాఖ్యానించారట.

NTR : ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జూనియర్.. శత జయంతి ఉత్సవాలకు పూర్తిగా దూరం..

అయితే సీన్ స్టార్ట్ అయ్యి, వెనకాల సౌండ్ ప్లే అవ్వడంతో పాము మెల్లిగా కదిలి వెళ్లి ఎన్టీఆర్ మెడకి ఆభరణం అయ్యిందట. ఇక అది చూసిన కె వి రెడ్డి, ఎన్టీఆర్ కి చేతులెత్తి దణ్ణం పెట్టి.. “రామారావు నువ్వు గొప్ప వ్యక్తివి కాదు అంతకుమించి” అంటూ వ్యాఖ్యానించారట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో నిర్మాత అశ్వినీ దత్ తెలియజేశాడు. కాగా ఈ ఏడాది ఎన్టీఆర్ 100వ పుట్టినరోజు వేడుక జరుగుతుంది. దీంతో గత ఏడాది మే 28 నుంచే ‘శకపురుషుని శత జయంతి ఉత్సవాలు’ అంటూ సంవత్సరాది వేడుకలను బాలకృష్ణ (Balakrishna) మొదలు పెట్టాడు. ఇటీవల విజయవాడలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా శత జయంతి అంకురార్పణ సభని ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.