NTR : ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జూనియర్.. శత జయంతి ఉత్సవాలకు పూర్తిగా దూరం..

ఖమ్మంలో జరిగే 54 అడుగులు ఎత్తు సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వెళ్లబోతున్నాడు. దీంతో శత జయంతి ఉత్సవాలకు పూర్తిగా దూరం..

NTR : ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జూనియర్.. శత జయంతి ఉత్సవాలకు పూర్తిగా దూరం..

Junior NTR is attending senior ntr statue opening at Khammam

NTR : తెలుగు రాష్ట్రాల్లో నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల హోరు కనిపిస్తుంది. ఈ 100వ పుట్టినరోజుని చరిత్రలో నిలిచేలా చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), బాలకృష్ణ (Balakrishna) గత ఏడాది మే 28 నుంచే ‘శకపురుషుని శత జయంతి ఉత్సవాలు’ అంటూ సంవత్సరాది వేడుకలు మొదలు పెట్టారు. మే 28న 100 పుట్టినరోజు కావడంతో నెల ముందు అంటే ఏప్రిల్ 28న విజయవాడ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించి శత జయంతి అంకురార్పణ సభ నిర్వహించారు బాలయ్య అండ్ చంద్రబాబు.

NTR 100 Years : ఎన్టీఆర్ ఎన్ని సినిమాల్లో శ్రీకృష్ణుడిగా నటించారో తెలుసా? పౌరాణిక పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ ఎన్టీఆర్..

ఈ కార్యక్రమానికి నారా, నందమూరి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అయితే ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ (NTR), కళ్యాణ్ రామ్ (Kalyan Ram) దూరంగా ఉన్నారు. అసలు ఆ కార్యక్రమం గురించి ఇద్దరు అన్నదమ్ములు ఎక్కడా మాట్లాడలేదు. దీంతో అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే కొంతమంది నెటిజెన్లు మాత్రం.. మే 28న జరిగే శత జయంతి వేడుకకు ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ హాజరవుతారు అంటూ కామెంట్స్ చేశారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఎన్టీఆర్ ఆ వేడుకకు కూడా దూరంగా ఉండబోతున్నాడని తెలుస్తుంది.

NTR – Pawan Kalyan : పవన్ కంటే ముందు ఎన్టీఆర్ ఆ పని చేశారు.. దివిసీమ ఉప్పెన!

మే 28న ఖమ్మంలో (Khammam) సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జరగనుంది. ఈ వేడుకకు హాజరు కావాలంటూ తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా కలిసి మరి ఆహ్వానించాడు. దీంతో ఆ రోజు ఎన్టీఆర్ ఆ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో నందమూరి అభిమానులు ఏ కార్యక్రమానికి హాజరుకావాలో అన్న సందేహంలో పడ్డారు. కాగా ఖమ్మంలోని విగ్రహం 54 అడుగులు ఎత్తుతో ఎన్టీఆర్ పోషించిన శ్రీకృష్ణుడి రూపంలో ఉండబోతుంది.