NTR 100 Years : ఎన్టీఆర్ ఎన్ని సినిమాల్లో శ్రీకృష్ణుడిగా నటించారో తెలుసా? పౌరాణిక పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ ఎన్టీఆర్..

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉంది కావున ఆ మహనీయుని గురించి మరోసారి తెలుసుకొని స్మరించుకుందాం.

NTR 100 Years : ఎన్టీఆర్ ఎన్ని సినిమాల్లో శ్రీకృష్ణుడిగా నటించారో తెలుసా? పౌరాణిక పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ ఎన్టీఆర్..

NTR 100 Years special NTR as Sri Krishna

NTR 100 Years : తెలుగువారికి ఓ గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్(NTR). నటుడిగా, రాజకీయనాయకుడిగా ఆయన జీవితం ఓ మహా గ్రంధం. సినిమాల్లో స్టార్ హీరోగా ఎదిగి ఎన్నో రికార్డులను సృష్టించి పేరు, ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించి తనని ఇంతటి వారిని చేసిన ప్రజలకు ఏమైనా చేయాలని రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం(TeluguDeshan) పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా గెలిచి తెలుగు ప్రజల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ప్రస్తుతం ఆయన భౌతికంగా లేకపోయినా ఇంకా తెలుగు వారి గుండెల్లో జీవించి ఉన్నారు.

నందమూరి తారకరామారావు 28 మే 1923లో జన్మించారు. ఈ సంవత్సరంతో ఆయన శత జయంతి పూర్తి చేసుకోనున్నారు. దీంతో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, అభిమానులు, తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గత సంవత్సర కాలంగా మే 28 వరకు నిర్వహిస్తూనే ఉంటామని తెలిపారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉంది కావున ఆ మహనీయుని గురించి మరోసారి తెలుసుకొని స్మరించుకుందాం.

ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు చేసినా అందరికి రాముడు, కృష్ణుడిగానే గుర్తుంటారు. తొలిసారి సంపూర్ణ రామాయణం సినిమాలో రాముడిగా వేసి ప్రేక్షకులని మైమరిపించి నిజంగా రాముడు ఇలాగే ఉంటాడేమో అనిపించేలా చేశారు ఎన్టీఆర్. ఇక మొదటిసారి మాయాబజార్ సినిమాలో కృష్ణుడిగా కనిపించి ఆ ముగ్ధ మనోహర రూపంతో ప్రేక్షకులని మెప్పించి ఏకంగా థియేటర్స్ లో హారతులు పట్టేలా చేశారు ఎన్టీఆర్. రాముడు, కృష్ణుడు పాత్రలే కాక రావణ, శివుడు, దుర్యోధన, బ్రహ్మశి విశ్వామిత్ర, శ్రీమద్విరాట వీరబ్రహ్మేంద్రస్వామి, అర్జునుడు, కర్ణుడు.. ఇలాంటి ఎన్నో గొప్ప పౌరాణిక పాత్రలు పోషించారు. ఆ పాత్రల్లో జీవించి పౌరాణిక పాత్రలు పోషించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా అని నిరూపించి పౌరాణిక పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచారు మహనీయుడు ఎన్టీఆర్.

ఈ పాత్రలతో గుడిలోనే కాదు థియేటర్ లో కూడా దేవుడ్ని చూడొచ్చు అని ఎన్టీఆర్ ప్రేక్షకులతో అనిపించారు. అసలు రాముడు, కృష్ణుడి పాత్రల్లో అయితే ఆయనే నిజంగా ఆ దేవుడేమో అనిపించేలా చేసి ఆయన ఫోటోలు, విగ్రహాలు పెట్టుకొని పూజలు చేశారు జనాలు. రాముడిగా లవకుశ, సంపూర్ణ రామాయణం, శ్రీరామాంజనేయ యుద్ధం, రామదాసు, శ్రీరామ పట్టాభిషేకం.. లాంటి పలు సినిమాల్లో మెప్పించారు.

Sr NTR : నేడు విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

ఇక కృష్ణుడిగా అయితే మాయాబజార్ సినిమాతో మొదలుపెట్టి.. వినాయకచవితి, దీపావళి, భక్త రఘునాథ్, శ్రీ కృష్ణార్జున యుద్ధం, కర్ణన్, వీరాభిమన్యు, శ్రీకృష్ణ తులాభారం, శ్రీ కృష్ణావతారం, శ్రీ కృష్ణ విజయం, కన్నన్ కరుణై, శ్రీకృష్ణాఆంజనేయ యుద్ధం, శ్రీమద్విరాట పర్వం.. ఇలా దాదాపు 17 సినిమాల్లో కృష్ణుడిగా నటించారు ఎన్టీఆర్. ఇందులో తమిళ్, తెలుగు సినిమాలు ఉన్నాయి. ఇన్ని సినిమాల్లో కృష్ణుడిగా నటించి అసలు నిజంగా కృష్ణుడు కూడా ఇలాగే ఉంటాడేమో అనిపించేలా చేశారు. ఆ పాత్రలో ఎన్టీఆర్ అంతలా లీనమైపోయి నటించారు. అందుకే ఇప్పటికి ఎన్టీఆర్ కృష్ణుడి వేషంలో ఉన్న ఫోటోలు, విగ్రహాలు చాలానే కనిపిస్తూనే ఉంటాయి.