NTR – Pawan Kalyan : పవన్ కంటే ముందు ఎన్టీఆర్ ఆ పని చేశారు.. దివిసీమ ఉప్పెన!
హుధుద్ సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన సహాయం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. అయితే అటువంటి సేవ కార్యక్రమం నందమూరి తారక రామారావు దివిసీమ ఉప్పెన చేశారు. ఆ కథ తెలుసా?

NTR and Pawan Kalyan donations at diviseema uppena and Hudhud
NTR – Pawan Kalyan : 2014లో ఆంధ్రప్రదేశ్ కి హుధుద్ (Hudhud) తూఫాన్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఆ తూఫాన్ తో తీరం ఒడ్డున ఉన్న విశాఖపట్నం తీవ్రంగా దెబ్బతింది. ఎంతో ఆస్తి నష్టం జరిగింది. అప్పుడే రాష్ట్ర విభజన కూడా జరగడంతో విశాఖ ప్రజలు తీవ్ర సమస్యను ఎదురుకొనే పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కోటి రూపాలు విరాళం ప్రకటించి ఒక సేవ కార్యక్రమానికి ఆజ్యం అయ్యాడు. ఆ తరువాత టాలీవుడ్ లోని పలువురు స్టార్స్ విశాఖ ప్రజలు కోసం ముందుకు వచ్చి సహాయం చేశారు.
Rajinikanth : ఎన్టీఆర్ వలనే రజినీకాంత్ నటుడు అయ్యాడు.. ఆ కథ ఏంటో తెలుసా?
అంతే కాకుండా మేము సైతం అనే కార్యక్రమాన్ని నిర్వహించే దాని నుంచి వచ్చే డబ్బుని హుధుద్ బాధితులకు ప్రభుత్వం ద్వారా అందించారు. మేము సైతం వంటి సేవ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కారణమంటూ ఎంతోమంది ప్రశంసలు జల్లు కురిపించారు. అయితే పవన్ కంటే ముందు నందమూరి తారక రామారావు (Sr.NTR) అటువంటి కార్యక్రమానికి నాంది పలికారు. 1997లో ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన దివిసీమ ఉప్పెన గురించి ఇప్పటి తరం వాళ్ళకి చాలా తక్కువ తెలుసు. అసలు ఎవరు ఊహించని ఆ ఉప్పెనలో రాత్రికి రాత్రే దాదాపు 20 వేల మంది చనిపోయారు. వేలాది ఇల్లు తుడిచి పెట్టుకుపోయాయి.
Rajinikanth: ఎన్టీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం చాలా ప్రత్యేకం – రజినీకాంత్
ఆ ఘటన దివిసీమ ప్రజలకి ఇప్పటికి ఒక పీడ కల. సహాయక చర్యలు కూడా మొదలు పెట్టలేని సమయంలో ఎన్టీఆర్ ఆ ఘటన తెలుసుకొని దివిసీమ చేరుకున్నారు. తీరం ఒడ్డున కుప్పలు కుప్పలుగా ఉన్న మృతదేహాలను చూసిన ఎన్టీఆర్ మనసు చలించిపోయింది. తినడానికి కూడా తిండి లేని దివిసీమ ప్రజలను చూసిన ఎన్టీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ బాధ్యతులు కోసం తన వంతు తాను విరాళం ప్రకటించడమే కాకుండా ఇతర నటీనటులను కూడా సాయం చేయాలంటూ పిలుపునిచ్చారు.
Rajinikanth: బాలకృష్ణపై రజినీకాంత్ కామెంట్స్.. అలా చేయాలంటే బాలయ్య ఒక్కడివల్లే అవుతుంది!
అంతేకాదు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు రాష్ట్ర ప్రజల నుంచి స్వయంగా విరాళాలు సేకరించి దివిసీమ ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తో పాటు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో దివిసీమలోని 11 గ్రామాల తుఫాను బాదితులకు సాయం అందించారు. ఇప్పటి జెనరేషన్ వాళ్ళకి ఇది తెలిసేలా బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు సినిమాలో ఈ సన్నివేశాన్ని చూపించారు.