Rajinikanth : ఎన్టీఆర్ వలనే రజినీకాంత్ నటుడు అయ్యాడు.. ఆ కథ ఏంటో తెలుసా?

తన స్టైల్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న రజినీకాంత్.. నటుడు కావడానికి ఎన్టీఆర్ కారణమట. ఆ కథ ఏంటో చూసేయండి.

Rajinikanth : ఎన్టీఆర్ వలనే రజినీకాంత్ నటుడు అయ్యాడు.. ఆ కథ ఏంటో తెలుసా?

Rajinikanth comments on NTR at 100 years of NTR function

Rajinikanth : ఎన్టీఆర్ శత జయంతి వేడుకల అంకురార్పణ సభకి ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ రజినీకాంత్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో రజినీకాంత్ మాట్లాడుతూ.. నందరమూరి తారక రామారావు తన జీవితం పై ఎటువంటి ప్రభావం చూపించారో అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. తన లైఫ్ లో మొట్టమొదటి చూసిన సినిమా పాతాళభైరవి అని తెలియజేశాడు. 6 ఏళ్ళ వయసులో ఆ సినిమా చూసినట్లు, ఆ తరువాత ఏ మూవీ చూసిన అది భైరవి సినిమానా? అని అడిగే వాడినని చెప్పుకొచ్చాడు. ఇక నటుడిగా మారిన తరువాత కెమెరా ముందు చెప్పిన ఫస్ట్ డైలాగ్ కూడా భైరవి ఇల్లు ఇదేనా? అని వెల్లడించాడు. అంతేకాదు తను హీరోగా పరిచయం అవుతూ చేసిన మూవీ పేరు కూడా భైరవి అనే తెలియజేశాడు.

Rajinikanth: బాలకృష్ణపై రజినీకాంత్ కామెంట్స్.. అలా చేయాలంటే బాలయ్య ఒక్కడివల్లే అవుతుంది!

ఇక తనకి 13 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు ఎన్టీఆర్ ని లవకుశ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ లో రియల్ గా చూసినట్లు చెప్పుకొచ్చాడు. 1966 లో శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో ఎన్టీఆర్ ని ధుర్యోధనుడు పాత్రలో చూసి మెస్మరైజ్ అయ్యిపోయినట్లు వెల్లడించాడు. ఆ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ చెప్పేందుకు మొదటిసారి తెలుగు నేర్చుకున్నాడట. ఇక 18 ఏళ్ళ వయసులో బస్సు కండక్టర్ అయ్యిన తరువాత ఒక యానివర్సరీ ఫంక్షన్ లో కురుక్షేత్రం డ్రామా వేయగా అందులో రజినీకాంత్ ధుర్యోధనుడు పాత్ర వేశాడు.

Rajinikanth: ఎన్టీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం చాలా ప్రత్యేకం – రజినీకాంత్

దీంతో ఎన్టీఆర్ ని ఇమిటేట్ చేస్తూ ధుర్యోధనుడు పాత్ర చేశాడట. ధుర్యోధనుడిగా తన నటన చూసి అక్కడి ఉన్న వారంతా తన యాక్టర్ అవ్వమని చెప్పారట. సినిమాలోకి వెళితే పెద్ద విలన్ అవుతావంటూ చెప్పడంతో తనకి సినిమాల పై ఆసక్తి కలిగినట్లు చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ ప్రభావితంతో సినిమాలోకి వచ్చిన రజిని.. టైగర్ సినిమాలో ఆయనతో కలిసి నటించే అవకాశం దక్కిందంటూ గుర్తు చేసుకున్నాడు.