Rajinikanth: ఎన్టీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం చాలా ప్రత్యేకం – రజినీకాంత్

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పాల్గొని, ఎన్టీఆర్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుకుచేసుకున్నాడు.

Rajinikanth: ఎన్టీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం చాలా ప్రత్యేకం – రజినీకాంత్

Rajinikanth About His Bond With NTR

Rajinikanth: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 100వ జయంతి సందర్భంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శకపురుడిని శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని రజినీకాంత్ గుర్తుకు చేసుకున్నాడు.

ఎన్టీఆర్‌ గురించి తాను ప్రత్యేకంగా ఏమీ చెప్పలేనని.. తాను పాతాళభైరవి సినిమా చూసే సమయంలో తనకు ఆరేడేళ్లు ఉంటాయని.. ఆ సినిమాలో భైరవి రూపం మాత్రమే తన మనసులో నిలిచి పోయిందని రజినీ తలిపాడు. భైరవి ఇల్లు ఇదేనా అని తన తొలి డైలాగ్ చెప్పానని.. హీరోగా తన తొలి చిత్రం పేరు కూడా భైరవి అని.. 1963లో లవ కుశ సినిమా తాను చూశానని.. సిల్క్ షర్ట్, పంచె, కూలింగ్ గ్లాస్‌తో ఉన్న ఎన్టీఆర్‌‌ను ప్రత్యక్షంగా చూసినట్లుగా రజినీ చెప్పుకొచ్చాడు.

NTR 100 jayanathi : చంద్రబాబు ఇంటికి రజనీకాంత్‌తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు,మరి పురంధేశ్వరి, తారక్ వచ్చేనా?ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరవుతారా?

కురుక్షేత్రం డ్రామాలో ఎన్టీఆర్‌ నటనను మాత్రమే అనుకరించానని.. తన స్నేహితుల ప్రోత్సాహంతో నటుడిని అయ్యానని.. టైగర్ సినిమాలో ఎన్టీఆర్‌‌తో కలిసి నటించే అవకాశం రావడం తన అదృష్టం అని.. తన పాత్ర గురించి ఆనాడు ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నాడని.. దానవీరశూరకర్ణ సినిమాలో ఎన్టీఆర్‌ గెటప్‌ను తాను ఒక సినిమాలో వేశానని.. అది చూసి ఎవడ్రా కోతిలా ఉన్నాడని తన స్నేహితుడు అన్నాడని రజినీకాంత్ తెలిపాడు.

అప్పటి నుంచి అటువంటి మేకప్ వేయలేదని.. బొబ్బిలి పులి సినిమా షూటింగ్ సమయంలో కలిసేందుకు వెళ్లగా.. అక్కడ ఎన్టీఆర్‌ రెండు పేజీల డైలాగ్‌ను ఒకే టేక్‌లో పూర్తి చేయడం చూసి ఆశ్చర్యపోయానట్లుగా తలైవా తెలిపాడు. ఎన్టీఆర్‌ తొలిసారిగా సీఎం అయినప్పుడు తాను ఎంతో సంతోషించానని.. తాను హిమాలయాలకు‌ వెళ్లిన సమయంలో మళ్లీ అంత ఆనందం వేసిందని రజినీకాంత్ అన్నాడు.

Sr NTR : నేడు విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

ఇక గతంలో రామోజీరావు సపోర్ట్ వల్ల సంక్షోభంలో తిరిగి నిలబడినట్లు ఎన్టీఆర్‌ తనకు చెప్పారని.. ఎన్టీఆర్ తరహాలో ప్రస్తుతం నరేంద్ర మోదీ మంచి పాలన అందిస్తున్నాడని.. కొంతమంది ఏదేదో అంటారని.. ‌వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని రజినీకాంత్ ఈ సందర్బంగా చెప్పుకొచ్చాడు.