NTR 100 jayanathi : చంద్రబాబు ఇంటికి రజనీకాంత్‌తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు,మరి పురంధేశ్వరి, తారక్ వచ్చేనా?ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరవుతారా?

అన్న నందమూరి తారక రామారావు శత దినోత్సవాల సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు ఏకమవుతారా? తారక్, పురంధేశ్వరులు హాజరవుతారా? నందమూరి కుటుంబ సభ్యుల మధ్య ఉండే అంతర్గత విభేధాలు తొలగేనా? సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్టీఆర్ శతదినోత్సవాలకు హాజరుకావటం వెనుక ఉండే కీలక అంశాలేంటీ?

NTR 100 jayanathi : చంద్రబాబు ఇంటికి రజనీకాంత్‌తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు,మరి పురంధేశ్వరి, తారక్ వచ్చేనా?ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరవుతారా?

Superstar Rajinikanth Meets Chandrababu

NTR 100 jayanathi : విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అలనాటి మేటి నటుడు, దివంగత ముఖ్యమంత్రి, తెలుగురవారి కీర్తిన నలుదిశలా చాటిన నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ శత జయంతి దినోత్సవాలు జరుపుతున్నారు. ఏప్రిల్ 28 నుంచి మే 28 వరకు ఈ దినోత్సవాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా తమిళ సూపర్ స్టార్ తలైవాగా పేరొందిన రజనీకాంత్ హాజరవుతున్నారు. ఎన్టీఆర్ ఎన్టీఆర్ శత జయంతి దినోత్సవాలకు తలైవా తరలి రావటంతో ఓ విశేషం. రజనీకాంత్ ను ప్రత్యేకంగా ఆహ్వానించటం..ఆయన తరలి రావటం వెనుక రాజకీయాలు ఉన్నాయా? అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రం విడిపోయాక 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఆ తరువాత ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోను..ప్రత్యేక ప్యాకేజ్ తీసుకున్న తరువాత ఏపీకి రావాల్సిన నిధుల విషయంతో విభేధించి పొత్తులనుతెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి బీజేకీ దూరంగా ఉండే చంద్రబాబు కొన్ని రోజుల క్రితం ప్రధాని మోదీపై పొగడ్తలు కురిపించటం ఆసక్తికరంగా మారింది. తాజాగా  తమిళ సూపర్ స్టార్  రజనీకాంత్ ఎన్టీఆర్ శతదినోత్సవాలకు రావటం వెనుక ఏదో ఉందనే ఊహాగానాలు తలెత్తుతున్నాయి.

ఎన్టీఆర్ శతదినోత్సవాలకు హాజరుకావటానికి ఇప్పటికే ఏపీ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో రజనీకాంత్ కు బాలకృష్ణ ఘన గన్నవరం విమానాశ్రయంలో రజినీకాంత్ కి నందమూరి బాలకృష్ణ, టీడీ జనార్దన్, సావనీర్ కమిటీ ఘానా స్వాగతం పలికారు. బాలయ్యను చూడగానే ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు రజనీకాంత్. ఎలా ఉన్నారంటూ పరస్పరం పలకరించుకున్నారు రజనీకాంత్-బాలయ్య. అనంతరం ఒకే కారులో నోవోటెల్ కు వెళ్లారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు వచ్చినందుకు రజనీకాంత్ కు కృతజ్ఞతలు తెలిపారు బాలయ్య. అన్నగారి కార్యక్రమానికి రాకుండా ఉండగలనా అంటూ వ్యాఖ్యానించారు రజనీకాంత్. రజనీకాంత్ తో హోటల్లో కాసేపు భేటీ అయ్యారు బాలయ్య.

ఆ తరువాత రజనీకాంత్ అమరావతిలోని చంద్రబాబు నివసానికి చేరుకున్నారు. ఆయన వెంటనే బాలకృష్ణ ఉండి స్వయంగా ఆయనే చంద్రబాబు ఇంటికి తీసుకెళ్లారు. చంద్రబాబు రజనీకాంత్ కు తేనీటి ఆతిధ్యం ఇచ్చారు. అలా చంద్రబాబు ఇంటికి బాలకృష్ణతో పాటు నందమూరి తారకరామారావు సంతానం అయిన నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ, లోకేశ్వరి,శ్రీనివాస్ తో పాలు పలువురు నందమూరి కుటుంబ సభ్యులు వచ్చారు.

Rajinikanth : ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కోసం విజయవాడలో సూపర్ స్టార్.. బాలయ్యతో కలిసి రజినీ సందడి..

ఇటువంటి సమయంలో ఎన్టీఆర్ కుమార్తె ప్రస్తుతం ఏపీ బీజేపీ నేత అయిన దగ్గుపాటి పురంధేశ్వరం వస్తారా? అలాగే నందమూరి కుటుంబంలో సినిమా గ్లామర్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. దగ్గుపాటి పురంధేశ్వరి విషయానికొస్తే ఆమె బీజేపీ. గతంలో కూడా చంద్రబాబుకు పురంధేశ్వరికి మధ్య రాజకీయంగాను..కుటుంబపరంగాను కూడా విభేధాలున్నాయి. చంద్రబాబు కుటుంబం..పురంధేశ్వరి కుటుంబాల మధ్య అంతగా సన్నిహిత సంబంధాలు లేవనే చెప్పాలి. వారి మధ్య రాజకీయ విమర్శలు కూడా ఉండేవి. ఇద్దరు కూడా సమన్వయంతోనే విమర్శలు చేసుకునేవారు.

అలాగే మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వివాహం విషయంలో చంద్రబాబు చాలా కీలకంగా వ్యవహరించారు.ఆయనే వివాహ ప్రతిపాదన తేవటం ప్రణతితో వివాహం జరిపించటం వెనుక చంద్రబాబు అత్యంత కీలకంగా వ్యవహరించారనే విషయం తెలిసిందే. ఆ తరువాత చంద్రబాబు,తారక్ మధ్య సన్నిహిత సంబంధాలు కొంతకాలం బాగానే..తరువాత తరువాత దూరం పెరిగింది. ఎన్నికల్లో టీడీపీ తరపున ఎన్టీఆర్ ప్రచారం చేయటం ఆ సమయంలో యాక్సిడెంట్ కు గురి కావటం జరిగింది. ముఖ్యంగా తారక్ కు చంద్రబాబుకు మధ్య దూరం పెరగటానికి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నానియే అని అంటుంటారు.

కొడాలి నానికి చంద్రబాబుతో చెప్పి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారని ఆ తరువాత కొడాలి వైసీపీలోకి వెళ్లిన తరువాత తారక్ సైలెంట్ అయిపోయారు. అంతర్గతంతో చంద్రబాబు, తారక్ కు మధ్య ఏం జరిగిందో గానీ..కొంతకాలంలో అన్ని విషయాల్లోను ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యుల కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు తారక్. అసెంబ్లీలో చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అత్యంత దారుణ వ్యాఖ్యలు చేసిన సందర్భంగా పెద్ద ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా మీడియా సమావేశం నిర్వహించి ఈ వ్యాఖ్యల్ని ఖండించారు. ఆ తరువాత చాలా రోజుల తరువాత తారక్ స్పందించినా డిప్లమేటిక్ గానే వ్యవహరించారు. ఆడవాళ్ల పట్ల అమర్యాదగా మాట్లాడకూడదని మాత్రమే అన్నారు. తారక్ నుంచి ఇటువంటి స్పందన ఎదురు చూడని నందమూరి అభిమానులు, టీడీపీ అభిమానులు కూడా తీవ్ర నిరాశ వ్యక్తంచేశారు. అసలు తారక్ స్పందించకుండా ఉంటే బాగుండు అని కూడా వ్యాఖ్యానించారు.

మరి తాత గురించి గొప్పగా చెప్పే తారక్..ఆయన మనుమడిగా పుట్టటమే గొప్ప అదృష్టం అని చెప్పే తారక్ చంద్రబాబు ఇంటికి రాకపోయినా ఫరవాలేదు గానీ ఎన్టీఆర్ శతదినోత్సవాలకు హాజరవుతాడా? లేదా? అలాగే పురంధేశ్వరి టీడీపీ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలకు హాజరు అవుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది..

కాగా..ఎన్టీఆర్ శతదినోత్సవ కార్యక్రమాల్లో ఆయన అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్య పరుస్తూ వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాలతో కూడిన 2 పుస్తకాలను నేడు ఈ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ పై తొలి పుస్తకం రాసిన సీనియర్ జర్నలిస్టు ఎస్.వెంకటనారాయణ పాల్గొననున్నారు.