NTR 100 Years : ఎన్టీఆర్ 40 ఏళ్ళ వయసులో కూచిపూడి నేర్చుకున్నారు.. ఏ సినిమా కోసమో తెలుసా?

ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో పౌరాణిక సినిమాలు చాలా ఉన్నాయి. రామాయణం, మహాభారతాలలోని ఘట్టాలని కూడా ఆయన సినిమాలుగా తీశారు. కృష్ణ, అర్జున, దుర్యోధన, కర్ణ, రామ, రావణ.. ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలని పోషించి మెప్పించారు.

NTR 100 Years : ఎన్టీఆర్ 40 ఏళ్ళ వయసులో కూచిపూడి నేర్చుకున్నారు.. ఏ సినిమా కోసమో తెలుసా?

NTR 100 Years special ntr learn kuchipudi at the age of 40 for a movie

NTR 100 Years :  తెలుగువారికి ఓ గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్(NTR). నటుడిగా, రాజకీయనాయకుడిగా ఆయన జీవితం ఓ మహా గ్రంధం. సినిమాల్లో స్టార్ హీరోగా ఎదిగి ఎన్నో రికార్డులను సృష్టించి పేరు, ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించి తనని ఇంతటి వారిని చేసిన ప్రజలకు ఏమైనా చేయాలని రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం(TeluguDesham) పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా గెలిచి తెలుగు ప్రజల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. నందమూరి తారకరామారావు 28 మే 1923లో జన్మించారు. ఈ సంవత్సరంతో ఆయన శత జయంతి పూర్తి చేసుకోనున్నారు.

దీంతో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, అభిమానులు, తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉంది కావున ఆ మహనీయుని గురించి మరోసారి తెలుసుకొని స్మరించుకుందాం.

ఎన్టీఆర్ చేసిన సినిమాల్లో పౌరాణిక సినిమాలు చాలా ఉన్నాయి. రామాయణం, మహాభారతాలలోని ఘట్టాలని కూడా ఆయన సినిమాలుగా తీశారు. కృష్ణ, అర్జున, దుర్యోధన, కర్ణ, రామ, రావణ.. ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలని పోషించి మెప్పించారు. అప్పట్లో డ్యాన్సులు అంటే సాధారణంగానే ఉండేవి. క్లాసిక్ డ్యాన్స్ లకు సాంగ్ ని బట్టి కొంచెం కొత్తగా ట్రై చేసి చేసేవారు. క్లాసికల్ డ్యాన్సులు, నాట్యాలు తప్ప అప్పటి సినిమాల్లో డ్యాన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఎన్టీఆర్ కూడా డ్యాన్స్ కోసం ప్రత్యేకంగా కోచింగ్ ఏమి తీసుకోలేదు. సినిమా చిత్రీకరణ సమయంలో మాస్టర్స్ చెప్పింది అప్పటికప్పుడు నేర్చుకొని వేసేవారు.

NTR 100 Years : ఎన్టీఆర్‌తో చిరంజీవి సినిమా.. రాజకీయాల్లోకి రావడానికి 2 ఏళ్ళ ముందు..

కానీ ఓ సినిమా కోసం ఎన్టీఆర్ 40 ఏళ్ళ వయసులో కూచిపూడి నృత్యం నేర్చుకున్నారంటే మీరు నమ్మగలరా? 1963లో మహాభారతంలోని విరాటపర్వం ఘట్టాన్ని నర్తనశాల పేరుతో ఎన్టీఆర్ సినిమా తీశారు. వనవాసంలో పాండవులు ఒక సంవత్సరం వివిధ వేషాల్లో అజ్ఞాతంగా బతకాల్సి వస్తుంది. ఆ ఘట్టమే నర్తనశాల. ఈ సినిమాలో ఎన్టీఆర్ అర్జునుడిగా, బృహన్నలగా నటించారు. విరాటరాజు కొలువులో నాట్యం నేర్పించే పాత్రలో బృహన్నలగా ఎన్టీఆర్ నటించారు.

NTR 100 Years : ఎన్టీఆర్ ఎన్ని సినిమాల్లో శ్రీకృష్ణుడిగా నటించారో తెలుసా? పౌరాణిక పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ ఎన్టీఆర్..

సినిమాలో నాట్యం నేర్పించే సీన్స్ ఉన్నాయి. అవి పర్ఫెక్ట్ గా రావాలంటే ఎన్టీఆర్ కి కూడా నాట్యం వచ్చి ఉండాలని నర్తనశాల సినిమా కోసం 40 ఏళ్ళ వయసులో కూచిపూడి గ్రేట్ డ్యాన్సర్ అయిన వెంపటి చినసత్యం దగ్గర ఎన్టీఆర్ కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు. ఈ సినిమాలో బృహన్నల పాత్రలో ఎన్టీఆర్ మెప్పించారు. కేవలం ఒక సినిమా కోసం, అది కూడా 40 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ కూచిపూడి నేర్చుకున్నారంటే ఆయనకు సినిమా మీద, ఒక పాత్ర మీద ఎంతటి నిబద్దత ఉందో అర్ధం చేసుకోవచ్చు.