Jersey Movie : క్రేజీ డేట్ లాక్ చేసేశారు..

నాని నటించిన ‘జెర్సీ’ హిందీలో అదే పేరుతో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ అవుతుంది.. రీసెంట్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు..

Jersey Movie : క్రేజీ డేట్ లాక్ చేసేశారు..

Jersey

Jersey Movie : ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ తర్వాత షాహిద్ కపూర్ మరో టాలీవుడ్ సినిమా రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ మూవీని అదే పేరుతో అల్లు అరవింద్ – దిల్ రాజుతో పాటు బాలీవుడ్ స్టార్ మేకర్ అమిన్ గిల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు..

Shahid Kapoor

పాండమిక్ కారణంగా విడుదల వాయిదా పడింది.. ఆదివారం ‘జెర్సీ’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ ఏడాదిలో చివరి రోజైన డిసెంబర్ 31న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. తెలుగు ‘జెర్సీ’ లానే హిందీ ‘జెర్సీ’ కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని చెప్తున్నారు మేకర్స్..

Prabhas : ప్రభాస్ బిర్యానీకి బాలీవుడ్ భామ ఫిదా..

మృణాళ్ ఠాకూర్ కథానాయికగా నటించగా.. తెలుగు ‘జెర్సీ’ డైరెక్ట్ చేసి ప్రశంసలందుకున్న గౌతమ్ తిన్ననూరి హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గీతా ఆర్ట్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాయి.

Gowtham Tinnanuri : రౌడీ హీరోతో జెర్సీ డైరెక్టర్..!