Gowtham Tinnanuri : రౌడీ హీరోతో జెర్సీ డైరెక్టర్..!

తెలుగులో చాలామంది యువ దర్శకులు ఉన్నారు.. వారిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గౌతమ్ తిన్ననూరి గురించి..

Gowtham Tinnanuri : రౌడీ హీరోతో జెర్సీ డైరెక్టర్..!

Vijay Deverakonda

Updated On : June 18, 2021 / 8:05 PM IST

Gowtham Tinnanuri: తెలుగులో చాలామంది యువ దర్శకులు ఉన్నారు. వారిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గౌతమ్ తిన్ననూరి గురించి. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తీసింది రెండు సినిమాలే అయినా వైవిధ్యమైన కథలతో మంచి పేరు సంపాదించుకున్నాడు..

అందులో సుమంత్ హీరోగా తీసిన ‘మళ్లీ రావా’ సినిమా మెలోడీ హిట్‌గా నిలవగా.. నానితో తీసిన ‘జెర్సీ’ మాత్రం బాక్సాఫీస్ దగ్గర సంచల విజయం సాధించింది.. ఐతే గౌతమ్ ఇప్పుడు ‘జెర్సీ’ ని హిందీలో షాహిద్ కపూర్‌తో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవగానే ఎవరితో సినిమా చేస్తాడని ఆసక్తి నెలకొంది.

గౌతమ్, రామ్ చరణ్‌తో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. దానికి సంబంధించి చరణ్‌కి ఒక కథని కూడా వినిపించారట. ఆ కథకి చరణ్ అంతగా ఇంప్రెస్ కాలేదట.. దీంతో అదే కథలో కొన్ని మార్పులు చేసి రౌడీ హీరో విజయ్ దేవరకొండకు వినిపించారట.. ఆ కథ విజయ్‌కి బాగా నచ్చిందని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

ప్రస్తుతం విజయ్, పూరి జగన్నాథ్‌తో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా తరువాత సుకుమార్‌తో ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాత శివ నిర్వాణతో ఒక సినిమా కమిట్ అయ్యాడు విజయ్.. ఈ మూడు సినిమాలు కంప్లీట్ అవ్వడానికి రెండేళ్లు సమయం పడుతుంది.. ఆ తరువాతే గౌతమ్- విజయ్ సినిమా పట్టాలెక్కనుంది. అప్పటిదాకా గౌతమ్ వెయిట్ చేస్తాడా.. లేక వేరే సినిమా తెరకెక్కిస్తాడో చూడాలి మరి.