Shahrukh Khan : ఎట్టకేలకు బాయ్‌కాట్ పై స్పందించిన షారుఖ్.. సినిమాలని సీరియస్ గా తీసుకోకండి..
ప్రెస్ మీట్ మీడియా వాళ్ళు పలు ప్రశ్నలు అడగగా వాటికి సమాధానాలు చెప్పారు చిత్రయూనిట్. గత కొంత కాలంగా బాయ్‌కాట్ బాలీవుడ్, బాయ్‌కాట్ మాఫియా, కొన్ని సినిమాలని బాయ్‌కాట్ చేయడం జరుగుతుంది. ఈ బాయ్‌కాట్ ఎఫెక్ట్ బాలీవుడ్ కి గట్టిగానే తగిలింది. ఇక పఠాన్ సినిమా రిలీజ్ కి ముందు కూడా................
Shahrukh Khan : షారుఖ్, దీపికా జంటగా జాన్ అబ్రహం విలన్ గా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా జనవరి 25న థియేటర్స్ లో రిలీజయి భారీ విజయం సాధించింది. నాలుగేళ్ల తర్వాత షారుఖ్ తెరపై కనిపించడంతో అభిమానులు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. పఠాన్ సినిమా మొదటి రోజు నుంచే భారీగా కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ఇప్పటికే పఠాన్ సినిమా అయిదు రోజుల్లో 542 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి సరికొత్త రికార్డుని సృష్టించింది.
అయితే పఠాన్ సినిమాకి రిలీజ్ కి ముందు ప్రమోషన్స్, ఇంటర్వ్యూలు ఏమి చేయలేదు. కానీ పఠాన్ సినిమా రిలీజయి ఇంతటి భారీ విజయం సాధించి కలెక్షన్స్ కొల్లగొడుతుండటంతో తాజాగా సోమవారం సాయంత్రం ముంబైలో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో షారుఖ్, దీపికా, జాన్ అబ్రహం, డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ పాల్గొన్నారు. మీడియాతో ముచ్చటించి వారు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు. షారుఖ్, దీపికా, జాన్ అబ్రహం స్టెప్పులతో సందడి చేశారు కూడా.
ఈ ప్రెస్ మీట్ మీడియా వాళ్ళు పలు ప్రశ్నలు అడగగా వాటికి సమాధానాలు చెప్పారు చిత్రయూనిట్. గత కొంత కాలంగా బాయ్‌కాట్ బాలీవుడ్, బాయ్‌కాట్ మాఫియా, కొన్ని సినిమాలని బాయ్‌కాట్ చేయడం జరుగుతుంది. ఈ బాయ్‌కాట్ ఎఫెక్ట్ బాలీవుడ్ కి గట్టిగానే తగిలింది. ఇక పఠాన్ సినిమా రిలీజ్ కి ముందు కూడా బాయ్‌కాట్ పఠాన్, బాయ్‌కాట్ షారుఖ్, బాయ్‌కాట్ బాలీవుడ్ అని మరోసారి ట్రెండ్ అయ్యాయి. కానీ ఈ సారి అవి పనిచేయలేదు. దీనిపై మీడియా షారుఖ్ ని ప్రశ్నించగా మొదటిసారి షారుఖ్ ఖాన్ ఈ బాయ్‌కాట్ వివాదంపై స్పందించాడు.
షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.. మేం ఎవ్వరం చెడ్డవాళ్లం కాదు. మేము చేసేది స్క్రీన్‌పై పాత్రలు మాత్రమే. ఆ సినిమానే మాకు ప్రపంచం. సినిమాలని, వినోదాన్ని సీరియస్‌గా తీసుకోకూడదు. మీతో, అందరితో మేము సోదర భావంతో ఉండాలనుకుంటాం. మాలో మాకు కూడా సోదర భావం ఉంది. ఇక దీపికా అమర్ అయితే నేను షారూఖ్ అక్బర్, జాన్ ఆంటోనీ ముగ్గురం అమర్ అక్బర్ ఆంటోనీ. ఇది సినిమా. ఇదే అందరితోనూ ఉంటాం. అలాగే మేము ఎవ్వరిని ద్వేషించం. ఇప్పుడున్న యువతకు అనుగుణంగా మారేలా ప్రయత్నిస్తున్నాం అని అన్నాడు.