Allu Arha : అర్హ కోసం సెట్‌లో అందరూ తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది..

శాకుంతలం సినిమాతో అల్లు అర్హ వెండితెరపై గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుందని అందరికి తెలిసిందే. శాకుంతలం సినిమాలో అల్లు అర్హ శకుంతల తనయుడు భరతుడి క్యారెక్టర్ వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రిలీజయిన ట్రైలర్ లో అల్లు అర్హ సింహం మీద ఎంట్రీ ఇచ్చి బన్నీ అభిమానులతో పాటు అందర్నీ ఫిదా చేసింది.

Allu Arha : అర్హ కోసం సెట్‌లో అందరూ తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది..

Shakunthalam Producer Neelima Guna Praises Allu Arha

Allu Arha :  అల్లు అర్జున్ కూతురుగా అర్హ ఇప్పటికే అందరికి పరిచయం. అర్హ చేసే అల్లరి, అర్హ క్యూట్ వీడియోలు, ఫోటోలు రెగ్యులర్ గా స్నేహరెడ్డి, బన్నీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు. అర్హకి కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఓ కవర్ సాంగ్ లో కూడా యాక్ట్ చేసింది అర్హ. ఇక శాకుంతలం సినిమాతో అల్లు అర్హ వెండితెరపై గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుందని అందరికి తెలిసిందే.

సమంత మెయిన్ లీడ్ లో గుణశేఖర్ దర్శకత్వంలో మన పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా శాకుంతలం. శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న గ్రాండ్ రిలీజ్ కానుంది. పాన్ ఇండియా వైడ్ ఈ సినిమాని రిలీజ్ చేస్తుండగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. శాకుంతలం సినిమాలో అల్లు అర్హ శకుంతల తనయుడు భరతుడి క్యారెక్టర్ వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రిలీజయిన ట్రైలర్ లో అల్లు అర్హ సింహం మీద ఎంట్రీ ఇచ్చి బన్నీ అభిమానులతో పాటు అందర్నీ ఫిదా చేసింది.

NMACC Launching Event : అంబానీ ఫుడ్ అంటే ఈ రేంజ్ లో ఉంటుంది.. NMACC లాంచింగ్ లో సెలబ్రిటీలకు వెండి ప్లేట్స్‌లో ఫుడ్..

ఇక సినిమా ప్రమోషన్స్ లో అందరూ అర్హ గురించి గొప్పగా చెప్తున్నారు. ఇప్పటికే సమంత అర్హ గురించి చెప్తూ.. తాను పుట్టుకతోనే స్టార్. సెట్ లో మొదటి రోజు 100 మంది మధ్యలో ఉన్నా ఏ మాత్రం భయం లేకుండా నటించింది. భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతుంది అని తెలిపింది. తాజాగా శాకుంతలం నిర్మాత నీలిమ గుణ అర్హ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అర్హ తెలుగు బాగా మాట్లాడుతుంది. బన్నీ గారు అర్హకి తెలుగు నేర్పించారు. మన తెలుగు మూలాలు పోకూడదని అర్హకి తెలుగులో అన్ని నేర్పిస్తున్నారు. సెట్ లో అర్హతో తెలుగు మాట్లాడటానికి తెలుగు రానివాళ్లంతా తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది. అర్హ కోసం శాకుంతలం సెట్ లో చాలా మంది తెలుగు నేర్చుకున్నారు అని తెలిపింది. దీంతో అభిమానులు, నెటిజన్లు అర్హతో పాటు బన్నీని కూడా అభినందిస్తున్నారు.