Shalu Chaurasia : ఫోన్ మాత్రమే కాదు డైమండ్ రింగ్ కూడా ఎత్తుకెళ్లారు.. లైంగిక దాడికి యత్నించాడు : చౌరాసియా

రెండు రోజుల క్రితం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద నటి చౌరాసియాపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తాజగా ఈ ఘటనపై షాలు చౌరాసియా మిన్న రాత్రి మీడియాతో

Shalu Chaurasia :  ఫోన్ మాత్రమే కాదు డైమండ్ రింగ్ కూడా ఎత్తుకెళ్లారు.. లైంగిక దాడికి యత్నించాడు : చౌరాసియా

Chaurasiya (1)

Shalu Chaurasiya :  రెండు రోజుల క్రితం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద నటి చౌరాసియాపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పార్క్ దగ్గర చౌరాసియా వాకింగ్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ఆమె సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో ఆమెకు గాయాలయ్యాయి. ఆ తర్వాత చౌరాసియా 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఈ కేసుని వేగంగా పరిశోధిస్తున్నారు. ఇప్పటికే నిందితుడి వేలి ముద్రలు కనిపెట్టారు. నిందితుడికి సంబందించిన డ్రెస్, షూస్ తో పాటు ఫోన్ లొకేషన్ ఆదారంగా ట్రేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు.

Puneeth Rajkumar : పునీత్ సంస్మరణ సభలో స్టార్ హీరోకు చేదు అనుభవం

తాజగా ఈ ఘటనపై షాలు చౌరాసియా మిన్న రాత్రి మీడియాతో మాట్లాడింది. రెండు రోజుల క్రితం కేబీఆర్‌ పార్కు సమీపంలో కారు పార్కు చేసి సాయంత్రం 6 గంటలకు వాకింగ్‌కు వెళ్లానని, మెయిన్‌ గేట్‌ వద్దకు వెళ్లి రాత్రి 8.15 గంటలకు తిరిగి వస్తుండగా వెనక నుంచి వచ్చిన ఆగంతుకుడు నోట్లో బట్ట కుక్కి కుడివైపు పొదలవైపు లాగడంతో షాక్‌కు గురయ్యానని తెలిపారు. దోపిడీ చేసి దాడికి పాల్పడిన దుండగుడు కాల్చి చంపేస్తానని బెదించినట్లు తెలిపారు.

RNR Manohar : ప్రముఖ డైరెక్టర్, నటుడు మృతి.. విషాదంలో సినీ పరిశ్రమ

అయితే నేను తెలుగులో మాట్లాడుతూ డబ్బులు ఇస్తానని చెప్పడంతో ఒక చేయి వదిలాడు. ఫోన్‌ పే చేస్తానని డయల్‌ 100కు రెండుసార్లు ఫోన్‌ చేశాను. ఇది గమనించిన దుండగుడు నా సెల్‌ఫోన్‌ను లాగేసుకున్నాడు. హెల్ప్‌ అంటూ అరుస్తుండగా చేతులు, ముఖంపై దాడి చేసాడు అని వివరించారు. కింద బండరాయిపైకి తోసివేయడంతో నేను స్పృహ తప్పాను. పొదల్లోకి లాగి నాపై లైంగిక దాడికి యత్నించాడు. అంతలో నాకు స్పృహ రావడంతో అతను బండరాయితో నా ముఖంపై కొట్టేందుకు ప్రయత్నించగా మోచేతితో అతని ప్రైవేట్‌ పార్ట్‌పై కొట్టి మెయిన్ రోడ్ వైపు ఉన్న ఫెన్సింగ్‌ వద్దకు వెళ్ళాను. ఫెన్సింగ్‌పై నుంచి కిందకు దూకి హెల్ప్‌ అని అరవడంతో దగ్గర్లో కాఫీ షాపులో పని చేసేవారు వచ్చారని తెలిపింది.

Pushpaka Vimanam : బాలీవుడ్‌లోకి ‘పుష్పక విమానం’

తనకు శత్రువులెవరూ లేరని, ఎవరిపై అనుమానం లేదని చెప్పింది. ఘటన జరిగిన వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చానని, పోలీసులు ఈ విషయంలో బాగా స్పందించారని, తన చేతికి ఉండే డైమండ్‌ రింగ్, సెల్‌ఫోన్‌ను కనిపెట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.