Puneeth Rajkumar : పునీత్ సంస్మరణ సభలో స్టార్ హీరోకు చేదు అనుభవం

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు రావడంతో బందోబస్తు కూడా భారీగానే పెట్టారు. అయితే ఈ సభ ప్రాంగణం వెలుపల ఓ స్టార్ హీరోకి చేదు అనుభవం ఎదురయింది.

Puneeth Rajkumar : పునీత్ సంస్మరణ సభలో స్టార్ హీరోకు చేదు అనుభవం

Darshan

Puneeth Rajkumar :  కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు కన్నడ సినీ పరిశ్రమ తరపున రెండు రోజుల క్రితం ‘పునీత్ నామన’ పేరుతో ఘనంగా సంస్మరణ సభ నిర్వహించారు. నవంబర్ 16న బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో భారీగా ఈ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైతోపాటు మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, కర్ణాటక ఎమ్మెల్యేలు, ఎంపీలు, కన్నడ సినీ పరిశ్రమ అంతా విచ్చేసింది. దేశం నలుమూలల నుంచి కూడా పునీత్ తో సన్నిహిత సంబంధాలున్న ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Burra Sai Madhav : ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్‌కు డాక్టరేట్

ఈ కార్యక్రమంలో పునీత్ కి నివాళులు అర్పించి, ఆయనతో తమకు ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు పలువురు ప్రముఖులు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు రావడంతో బందోబస్తు కూడా భారీగానే పెట్టారు. అయితే ఈ సభ ప్రాంగణం వెలుపల ఓ స్టార్ హీరోకి చేదు అనుభవం ఎదురయింది.

RNR Manohar : ప్రముఖ డైరెక్టర్, నటుడు మృతి.. విషాదంలో సినీ పరిశ్రమ

కన్నడ స్టార్ హీరో దర్శన్ కి పోలీసుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. కర్ణాటకలో అభిమానులు దర్శన్ ని D బాస్ అని పిలుచుకుంటారు. టాప్ స్టార్ హీరోలలో దర్శన్ కూడా ఒకరు. పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభకు దర్శన్ కొంచెం ఆలస్యంగా రావడంతో ఆయనను గేటు దగ్గర పోలీసులు ఆపారు. లోపల ఆడిటోరియం ఫుల్ అయిందని, కూర్చోటానికి సీట్లు లేవని, దయచేసి వెళ్ళిపొండి అంటూ పోలీసులు దర్శన్ ను ఆపేసారు.

Pushpaka Vimanam : బాలీవుడ్‌లోకి ‘పుష్పక విమానం’

అయితే దర్శన్ తను లోపలికి వెళ్లి కాసేపు ఉండి మళ్లీ బయటికి వచ్చేస్తాను అని చెప్పినా కూడా పోలీసులు వినిపించుకోలేదు. కనీసం నిలబడి చూస్తాను అని చెప్పినా కూడా వాళ్లు ఒప్పుకోలేదు. ఆ సమయంలో స్టార్ హీరో ద‌ర్శ‌న్‌తోపాటు కొంతమంది ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. చాలా సేపు పోలీసులతో మాట్లాడిన తర్వాత ఉన్నతాధికారులు వచ్చి దర్శన్ ను లోపలికి అనుమతించారు. కానీ లోపలికి వెళ్లినా కూర్చోవడానికి సీట్లు లేక సెకండ్ క్లాస్ లో కాసేపు కూర్చున్నాడు దర్శన్. అయితే అక్కడ ఇబ్బందిగా ఉండడంతో కొద్దిసేపట్లోనే ఆయన వెళ్ళిపోయాడు. దర్శన్ పోలీసులతో మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.