Shanmukh Jaswanth : వాళ్లిద్దరికీ ఇష్టమైతే మాక్కూడా ఇష్టమే

షణ్ముఖ్ జస్వంత్ - దీప్తి సునయనల ప్రేమ వ్యవహారం గురించి షన్నూ మదర్ క్లారిటీగా చెప్సేశారు..

Shanmukh Jaswanth : వాళ్లిద్దరికీ ఇష్టమైతే మాక్కూడా ఇష్టమే

Deepthi Sunaina Shanmukh Jaswanth

Updated On : October 27, 2021 / 11:34 AM IST

Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్.. ఇప్పటి యూత్‌కి, యూట్యూబ్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారికి కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు. ‘ది సాఫ్ట్‌వేర్ డెవలపర్’ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సూర్య క్యారెక్టర్‌తో యువతను ఆకట్టుకుని షన్నుగా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.

Ranbir Kapoor – Alia Bhatt : పెళ్లికి బాజా మోగింది..

‘బిగ్ బాస్ 5’ లో హౌస్‌మెట్స్ అందరికంటే కూడా మంచి ఫాలోయింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయనల ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే ఇటీవల షణ్ముఖ్ పుట్టినరోజు సందర్భంగా దీప్తి సునయన బిగ్ బాస్ ప్రేక్షకుల సాక్షిగా తన ప్రియుడికి సర్‌ప్రైజ్ ఇచ్చింది..

Bigg Boss 5 Telugu : ‘షన్నూ.. ఐ లవ్ యూ’.. దీప్తి సునయన సర్‌ప్రైజ్..

దీప్తి, ‘షన్నూ.. ఐ లవ్ యూ’ అని చెప్పగానే.. షణ్ముఖ్ సిగ్గుతో మొగ్గలేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఇక రీసెంట్‌గా షన్నూ – దీప్తిల రిలేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటని షణ్ముఖ్ మధర్‌ని అడగ్గా ఆమె పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. ‘షన్నూ – దీప్తి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్.. వాళ్లిద్దరికీ ఇష్టమైతే మాక్కూడా ఇష్టమే’ అంటూ షన్నూ – దీప్తి సునయనల ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె.

Shanmukh Jaswanth : నావల్ల కాదు.. వెళ్లిపోయి వీడియోలు చేసుకుంటా..