Ranbir Kapoor – Alia Bhatt : పెళ్లికి బాజా మోగింది..

బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌ల వెడ్డింగ్‌కి ముహూర్తం ఫిక్స్..

Ranbir Kapoor – Alia Bhatt : పెళ్లికి బాజా మోగింది..

Ranbir Kapoor Alia Bhatt

Updated On : October 26, 2021 / 6:24 PM IST

Ranbir Kapoor – Alia Bhatt: బాలీవుడ్ స్టార్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌ల ప్రేమ వ్యవహారం గతకొద్ది సంవత్సరాలుగా ట్రెండింగ్‌ టాపిక్.. వీరి ప్రేమ గురించి, పెళ్లి గురించి నేషనల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా చేసేసుకున్నారని టాక్.

Bunty Aur Babli 2 : ఈ ‘బంటీ – బబ్లీ’ ఎవరబ్బా?

ఇటీవల తమ పెళ్లి గురించి కాస్త ఎమోషనల్‌గా మాట్లాడాడు రణ్‌బీర్. ‘మహమ్మారి మన జీవితాల్లోకి ప్రవేశించకపోయి ఉంటే ఈపాటికి మా పెళ్లి అయిపోయి ఉండేది. పెళ్లి గురించి ఇప్పుడు ఇంతకంటే ఇంకేమీ చెప్పలేను. కానీ, ఆ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోవాలనుకుంటున్నాను. లాక్‌డౌన్ సమయంలో ఆలియా గిటార్ నుంచి స్క్రీన్ రైటింగ్ వరకు చాలా విషయాలు నేర్చుకుంది. నేను నా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపాను. కొన్ని పుస్తకాలు చదివాను. ప్రతిరోజూ రెండు, మూడు సినిమాలు చూశాను’ అని చెప్పిన సంగతి తెలిసిందే.

Chiranjeevi Fan : దివ్యాంగ అభిమాని సాహసం.. చలించిపోయిన చిరు..

అయితే ఇప్పుడు అలియా – రణ్‌బీర్‌ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. డిసెంబర్‌లో ఇద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వబోతున్నారంటూ బాలీవుడ్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఆలియా టాలీవుడ్ డెబ్యూ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ 2021 జనవరి 7న, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించిన ‘గంగుబాయ్ కతియావాడి’ జనవరి 6న రిలీజ్ కానున్నాయి.

Akira Nandan : ‘లిటిల్ పవర్‌‌స్టార్’ ఎంట్రీ ఫిక్స్.. అందుకే ఇవన్నీ..