Bhola Shankar: మెగాస్టార్‌తో ‘స్పెషల్’ చిందులు వేసేందుకు రెడీ అవుతోన్న శ్రియా.. నిజమేనా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో అందాల భామ శ్రియా సరన్ డ్యాన్స్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Bhola Shankar: మెగాస్టార్‌తో ‘స్పెషల్’ చిందులు వేసేందుకు రెడీ అవుతోన్న శ్రియా.. నిజమేనా?

Shriya Saran To Sizzle Alongside Chiranjeevi In Bhola Shankar

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళాశంకర్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేశ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Bhola Shankar: ‘భోళాశంకర్’లో హైలైట్ కానున్న స్పెషల్ ట్రాక్.. ఏమిటంటే?

ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరు సోదరిగా నటిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, ఈ సినిమాలో తాజాగా మరో స్టార్ బ్యూటీ కూడా నటించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ బ్యూటీ శ్రియా సరన్ భోళా శంకర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో చిందులేయనుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలో ‘ఠాగూర్’ మూవీలో చిరుతో కలిసి రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.

Bhola Shankar : యాక్షన్ షెడ్యూల్ మొదలుపెట్టిన భోళాశంకర్..

అయితే, ఇప్పుడు చిరు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో సీనియర్ బ్యూటీ కావాలని చిత్ర యూనిట్ శ్రియాను సంప్రదించగా, ఆమె ఈ సినిమాలో స్పెషల్‌గా కనిపించేందుకు ఓకే చెప్పింది. ఇక ఈ సినిమాలో చిరుతో కలిసి శ్రియా వేసే స్టెప్పులకు థియేటర్లలో విజిల్స్ పడటం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది. అయితే, ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.