Shruthi Hassan : మళ్ళీ తెలుగులో బిజీ అవుతున్న శృతిహాసన్

మళ్ళీ గత సంవత్సరం నుంచి శృతిహాసన్ తెలుగు సినిమాలతో బిజీ అయిపోయింది. 2021లో తెలుగులో 'క్రాక్', 'వకీల్ సాబ్' లాంటి భారీ హిట్స్ ని అందుకుంది శృతి. శృతిహాసన్ కి హిందీ, తమిళ్ సినిమాల...

Shruthi Hassan : మళ్ళీ తెలుగులో బిజీ అవుతున్న శృతిహాసన్

Shruthi Hassan

Shruthi Hassan :   కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి అడుగుపెట్టినా తన ట్యాలెంట్ తోటే వరుస సినిమాలు చేస్తూ వస్తుంది శృతి హాసన్. కేవలం హీరోయిన్ గానే కాక సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా తన ట్యాలెంట్ చూపిస్తుంది. తెలుగులో ‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ‘గబ్బర్ సింగ్’ తో స్టార్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. 2017లో ‘కాటమ రాయుడు’ సినిమా తర్వాత మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకుంది శృతిహాసన్. దీనికి కరోనా కూడా తోడవ్వడంతో 2021 వరకు శృతిహాసన్ తెలుగు సినిమాలేవీ రిలీజ్ అవ్వలేదు.

మళ్ళీ గత సంవత్సరం నుంచి శృతిహాసన్ తెలుగు సినిమాలతో బిజీ అయిపోయింది. 2021లో తెలుగులో ‘క్రాక్’, ‘వకీల్ సాబ్’ లాంటి భారీ హిట్స్ ని అందుకుంది శృతి. శృతిహాసన్ కి హిందీ, తమిళ్ సినిమాల కంటే తెలుగులోనే ఎక్కువ విజయాలు వస్తుండటంతో తెలుగు మీదే మళ్ళీ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది.

Chiranjeevi : మెగాస్టార్ మాస్ రోల్ సరసన శృతిహాసన్

ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ‘సలార్‌’ సినిమాలో చేస్తుంది. ఒకపక్క ఈ సినిమా షూట్ చేస్తూనే మరోవైపు బాలకృష్ణ 107వ సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా షూట్ సంక్రాంతి తర్వాత మొదలవ్వనుంది. తాజాగా మెగాస్టార్ సరసన చిరంజీవి 154వ సినిమాలో కూడా శృతి హాసన్ ని హీరోయిన్ గా ఓకే చేసినట్టు సమాచారం. దీంతో శృతి చేతిలో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. మరిన్ని తెలుగు సినిమాలు ఓకే అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి తెలుగులో శృతి హాసన్ మళ్ళీ బిజీ అవుతుంది. గత సంవత్సరం రెండు హిట్స్ సాధించినట్లే ఈ సినిమాలన్నీ కూడా హిట్ అవుతాయనే ఆశిస్తుంది.