Chiranjeevi : మెగాస్టార్ మాస్ రోల్ సరసన శృతిహాసన్

బాబీ డైరెక్షన్ లో చిరంజీవి 154వ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. సముద్ర తీరంలో, జాలర్ల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో....

Chiranjeevi : మెగాస్టార్ మాస్ రోల్ సరసన శృతిహాసన్

Shruthi Hassan

Chiranjeevi :  చిరంజీవి ‘సైరా’ సినిమా తర్వాత వేగం పెంచారు. వరుస ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి చేతిలో అయిదు సినిమాలు ఉన్నాయి. అందులో బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా ఉంది. ఇది చిరంజీవి 154వ సినిమాగా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. సముద్ర తీరంలో, జాలర్ల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది. ఈ సినిమాకి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ ని ఓకే చేసినట్టు తెలుస్తుంది. ఒకప్పుడు వరుస తెలుగు సినిమాలు చేసిన శృతిహాసన్ మధ్యలో బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు తెలుగులో బిజీ అవుతుంది. ఇటీవలే రవితేజ సరసన ‘క్రాక్’ సినిమాతో వచ్చి భారీ విజయం సాధించింది. ప్రభాస్‌తో కలిసి ‘సలార్‌’లో కూడా సందడి చేయనుంది. మరోవైపు బాలకృష్ణ 107వ సినిమాలో కూడా హీరోయిన్ గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ సరసన ఛాన్స్ దక్కించుకుంది.

Regina Cassandra : చిరంజీవి కోసమే ఈ ఐటెంసాంగ్ చేశాను

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. డైరెక్టర్ బాబీ శృతికి ఈ సినిమా కథ ఇటీవల వినిపించాడట. స్టోరీ, ఆమె పాత్ర నచ్చడంతో మెగాస్టార్ సరసన ఒప్పుకుందని సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.