Regina Cassandra : చిరంజీవి కోసమే ఈ ఐటెంసాంగ్ చేశాను

రెజీనా మొదటిసారి ఐటెం సాంగ్ చేసింది. ఇటీవల పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఈ సాంగ్ గురించి మాట్లాడింది. చిరంజీవి కోసమే తాను ‘ఆచార్య’ చిత్రంలోని ఈ సాంగ్ లో చేశానని.............

Regina Cassandra :  చిరంజీవి కోసమే ఈ ఐటెంసాంగ్ చేశాను

Acharya

Updated On : January 7, 2022 / 7:18 AM IST

Regina Cassandra :   మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘ఆచార్య’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఫిబ్రవరిలో ఈ సినిమాని విడుదల చేయనున్నారని ప్రకటించారు. ఇక ఈ సినిమా నుంచి వరుసగా టీజర్, ఒక్కో సాంగ్ ని విడుదల చేస్తున్నారు. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ‘శానా కష్టం…’ అనే ఐటెం సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకెళ్తుంది. ఇందులో మెగాస్టార్ తో కలిసి హీరోయిన్ రెజీనా స్టెప్పులేసింది.

Daksha Nagarkar : రవితేజకు లేడీ విలన్ గా మరో యువ హీరోయిన్

రెజీనా మొదటిసారి ఐటెం సాంగ్ చేసింది. ఇటీవల పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఈ సాంగ్ గురించి మాట్లాడింది. చిరంజీవి కోసమే తాను ‘ఆచార్య’ చిత్రంలోని ఈ సాంగ్ లో చేశానని రెజీనా తెలిపింది. ఈ పాటని నాలుగు రోజులు రాత్రి పూట షూట్ చేసి పూర్తి చేశారు. నేను అంతకముందు ఎప్పుడూ ఇలాంటి ప్రత్యేక సాంగ్స్ చేయలేదు. చిరంజీవి కోసమే తొలిసారిగా ఒప్పుకున్నాను అని తెలిపింది రెజీనా. చిరంజీవిని మెగాస్టార్‌ అని ఎందుకు పిలుస్తారో సెట్స్‌లో చూస్తే అర్థమైందంది. చిరంజీవి డ్యాన్స్‌ తనకెంతో ఇష్టమని, ఆయనతో డ్యాన్స్ చేయాలంటే చాలా కష్టం అని, అంతే కాక చిరంజీవి యువ నటుల్ని ప్రోత్సహిస్తారని రెజీనా తెలిపింది.