Annaatthe: సిద్ శ్రీరామ్, శ్రేయ ఘోషల్.. ‘అన్నాత్తై’ నుండి మంచి మెలోడీ

ఈ మధ్య కాలం దక్షణాది సినిమా పాటలలో హిట్ నంబర్స్ లో ఎక్కువ శాతం సిద్ శ్రీరామ్ పాటలే. చిన్న సినిమాలలో కూడా శ్రీరామ్ గొంతు వినిపిస్తే ఆ పాట రేంజ్ మారిపోతుంది. ఇక శ్రేయ ఘోషల్ గురించి..

Annaatthe: సిద్ శ్రీరామ్, శ్రేయ ఘోషల్.. ‘అన్నాత్తై’ నుండి మంచి మెలోడీ

Annaatthe

Annaatthe: ఈ మధ్య కాలం దక్షణాది సినిమా పాటలలో హిట్ నంబర్స్ లో ఎక్కువ శాతం సిద్ శ్రీరామ్ పాటలే. చిన్న సినిమాలలో కూడా శ్రీరామ్ గొంతు వినిపిస్తే ఆ పాట రేంజ్ మారిపోతుంది. ఇక శ్రేయ ఘోషల్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె పాడిన వందల పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఇద్దరూ కలిసి ఓ మంచి మెలోడీ పాడితే ఎలా ఉంటుంది. తమిళ సంగీత దర్శకుడు ఇమాన్ ఈ కాంబినేషన్ ను సెట్ చేశాడు.

RRR: నిర్మాతల సంప్రదింపులు.. ఆర్ఆర్ఆర్ డేట్ మారుతుందా?

సిద్ శ్రీరామ్, శ్రేయాఘోషల్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అన్నాత్తై కోసం పడిన పాట శనివారం విడుదల కానుంది. తలైవర్ రజినీకాంత్ హీరోగా స్టార్ దర్శకుడు శివ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సినిమా అన్నాత్తై. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమాతో రజినీ ఖచ్చితంగా అదిరే కం బ్యాక్ ఇస్తారని అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ సినిమా మీద అంచనాలను రేటింపు చేస్తున్నాయి.

Telugu Star Hero’s: స్టార్ హీరోల బిజీ షెడ్యూల్స్.. ఒకటి కాగానే మరొకటి సెట్స్ మీదకి!

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదలై భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. లెజెండరీ గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట సినిమా సంగీతంపై ఒక మార్క్ సెట్ చేసింది. ఇక ఇప్పుడు మేకర్స్ మరో బ్యూటిఫుల్ సాంగ్ ని విడుదల చేయనున్నారు. రజినీ నయన్ ల మధ్య సాగే ఈ మెలోడి పాటకు సిద్ శ్రీరామ్, శ్రేయాఘోషల్ గొంతు తోడవడంతో విడుదలకు ముందు ఈ పాట సూపర్ హిట్ అనే టాక్ సొంతం చేసుకుంది. మరి పాట ఎలా ఉంటుందో వినాలంటే మాత్రం రేపు సాయంత్రం వరకు వేచిఉండాల్సిందే.