RRR: నిర్మాతల సంప్రదింపులు.. ఆర్ఆర్ఆర్ డేట్ మారుతుందా?

కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్లు సినిమాలకి బ్యాడ్ టైం నడుస్తూ వచ్చింది. కరోనా తర్వాత కూడా పరిస్థితులు చక్కబడకపోవడంతో గత ఏడాది నుంచి రెండు మూడు పెద్ద సినిమాలే విడుదల అయ్యాయి.

RRR: నిర్మాతల సంప్రదింపులు.. ఆర్ఆర్ఆర్ డేట్ మారుతుందా?

Rrr

RRR: కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్లు సినిమాలకి బ్యాడ్ టైం నడుస్తూ వచ్చింది. కరోనా తర్వాత కూడా పరిస్థితులు చక్కబడకపోవడంతో గత ఏడాది నుంచి రెండు మూడు పెద్ద సినిమాలే విడుదల అయ్యాయి. ఇప్పుడే మళ్ళీ పాత రోజులు వచ్చే సూచనలు కనిపించడంతో ఒక్కో సినిమా వరసగా విడుదల తేదీలు ప్రకటిస్తున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడిన షూటింగ్స్ కూడా పూర్తిచేసుకొని వరసగా డేట్స్ లాక్ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేసి అతి భారీ సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి.

Telugu Star Hero’s: స్టార్ హీరోల బిజీ షెడ్యూల్స్.. ఒకటి కాగానే మరొకటి సెట్స్ మీదకి!

ఈ క్రమంలో పెద్ద పండగ రోజున పెద్ద సినిమాల మద్య క్లాష్ ఏర్పడుతుంది. ఇప్పటికే సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, పవర్ స్టార్ ‘భీమ్లా నాయక్’, రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’,తో పాటు ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ కూడా పండగకి ముందే వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అన్ని సినిమాలు ఒకేసారి వస్తుండడంతో కలెక్షన్స్ విషయంలో నష్టపోవాల్సి వస్తుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఎవరొకరు వెనక్కు తగ్గాలి లేదంటే అందరికీ నష్టాలు తప్పవు.

Annaatthe: సిద్ శ్రీరామ్, శ్రేయ ఘోషల్.. ‘అన్నాత్తై’ నుండి మంచి మెలోడీ

కాగా, ఈ మధ్య ఇండస్ట్రీలో రాజుకున్న టికెట్ల వివాదంతో పాటు చాలా విషయాలపై ఇప్పుడు నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా కొత్త డేట్ తో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్ ముందే డేట్స్ ప్రకటించగా తర్వాత ఆర్ఆర్ఆర్ ముందే వస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ విషయంపై చర్చించుకున్న నిర్మాతలు ఆర్ఆర్ఆర్ ఒక్కటే వెనక్కు తగ్గితే మిగతా మూడు సినిమాలకు నష్టం లేకుండా ఉంటుందని అభిప్రాయానికొచ్చినట్లు తెలుస్తుంది.

Tamil Stars : అన్ని కోట్లిచ్చి టాలీవుడ్‌కి తెచ్చుకుంటున్నారా?

సంక్రాంతి అంటే సినిమా మార్కెట్ కు కూడా భారీ పండగ కావడంతో మిగతా మూడు సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా విడుదలకి అవకాశం ఉంటుంది. అదే ఆర్ఆర్ఆర్ విడుదలైతే మాత్రం మిగతా అన్ని సినిమాలఫై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ కారణంగానే మళ్ళీ ఇంకో కొత్త డేట్ కి షిఫ్ట్ అవ్వబోతుందని టాక్ వినిపిస్తుంది. అది కూడా ఎంతో దూరం లేకుండా జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26కి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట. అయితే.. దీనిపై ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.