Tamil Stars : అన్ని కోట్లిచ్చి టాలీవుడ్‌కి తెచ్చుకుంటున్నారా?

దళపతి విజయ్, ధనుష్, శివ కార్తికేయన్ టాలీవుడ్ ఎంట్రీ సినిమాలకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు..

Tamil Stars : అన్ని కోట్లిచ్చి టాలీవుడ్‌కి తెచ్చుకుంటున్నారా?

Tamil Stars

Updated On : October 8, 2021 / 1:55 PM IST

Tamil Stars: కోలీవుడ్ స్టార్స్ టాలీవుడ్ మీద కన్నేశారు. స్ట్రైట్ తెలుగు సినిమాలతో తమ మార్కెట్‌ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ధనుష్ – శేఖర్ కమ్ముల సినిమా ఫిక్స్ అయిపోయింది. దళపతి విజయ్ – వంశీ పైడిపల్లి కాంబో సెట్ చేశారు దిల్ రాజు. ఇక ‘జాతిరత్నాలు’ తో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయిన అనుదీప్ దర్శకత్వంలో తమిళ యంగ్ స్టార్ శివ కార్తికేయన్ తెలుగులో సినిమా చెయ్యబోతున్నారు.

Kondapolam : రివ్యూ..

మరోవైపు శంకర్ – లింగుస్వామి వంటి కోలీవుడ్ డైరెక్టర్స్ టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఈ ముగ్గురు తమిళ్ హీరోల తెలుగు డెబ్యూ మూవీ రెమ్యునరేషన్‌కి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దళపతి విజయ్ టాలీవుడ్ ఎంట్రీకి దిల్ రాజు అక్షరాలా వంద కోట్ల రూపాయలు ఇస్తున్నారట.

Kollywood

 

ఇక ధనుష్ అయితే 50 కోట్లు తీసుకుంటున్నాడట. శివ కార్తికేయన్ కూడా పాతిక కోట్లు అడిగాడని అంటున్నారు. విజయ్, ధనుష్ తమిళనాట స్టార్ హీరోలు.. యంగ్ హీరో శివ కార్తికేయన్ కూడా టీవీ యాంకర్ స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చాడు. ఈ ముగ్గురు హీరోలూ పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Thalapathy 66 : దళపతి విజయ్ టాలీవుడ్ ఎంట్రీ..