Thalapathy 66 : దళపతి విజయ్ టాలీవుడ్ ఎంట్రీ..

డైరెక్టర్ శంకర్‌ను టాలీవుడ్‌కి తీసుకొచ్చిన దిల్ రాజు.. దళపతి విజయ్‌ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు..

Thalapathy 66 : దళపతి విజయ్ టాలీవుడ్ ఎంట్రీ..

Thalapathy 66

Thalapathy 66: కోలీవుడ్ టాప్ స్టార్ దళపతి విజయ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. శంకర్ – రామ్ చరణ్ లతో ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమా సెట్ చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరో క్రేజీ కాంబినేషన్ రెడీ చేశారు. డైరెక్టర్ శంకర్‌ను టాలీవుడ్‌కి తీసుకొచ్చిన దిల్ రాజు.. దళపతి విజయ్‌ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.

RC 15 : పోస్టర్ అంత కాస్టా.. శంకర్ సినిమా అంటే అంతే మరి..!

ఇటీవల కాలంలో త‌ను చేసే ప్రతి సినిమాతో విజయ్ పాపులారిటీ మరింతగా పెరుగుతోంది. విజ‌య్ త‌న 66వ సినిమాను నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై జాతీయ అవార్డు గెలుచుకున్న నిర్మాత దిల్ రాజు, శిరీష్ భారీ స్థాయిలో నిర్మించ‌నున్నారు.

Prabhas : ప్రభాస్ బిర్యానీకి బాలీవుడ్ భామ ఫిదా..

ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు మేక‌ర్స్‌. దళ‌ప‌తి విజయ్, వంశీ పైడిపల్లి మరియు దిల్ రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ మీద అటు ప్రేక్ష‌కుల్లో ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో విప‌రీత‌మైన బ‌జ్ ఉంది. సినిమా రంగం ప‌ట్ల అభిరుచి, నైపుణ్యం క‌లిగిన వ్యక్తుల క‌ల‌యిక‌తో ఈ సినిమా ఒక క్రేజీ ప్రాజెక్ట్‌గా మారింది.

Mohan Babu : చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్.. సంతోషమే..

ప్ర‌స్తుతం విజ‌య్, నెల్స‌న్ ద‌ర్శ‌కత్వంలో చేస్తున్న తన 65వ చిత్రం ‘బీస్ట్’ పూర్తి కాగానే ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ప్రముఖ నటీనటులు మరియు అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అతి త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

Shraddha Kapoor : శ్రద్ధా సింప్లిసిటీకి నెటిజన్ల ప్రశంసలు..