Mohan Babu : చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్.. సంతోషమే..

‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీచ్ సెన్సేషన్ అయ్యింది..

Mohan Babu : చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్.. సంతోషమే..

Mohan Babu

Updated On : September 26, 2021 / 5:04 PM IST

Mohan Babu: ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీచ్ సెన్సేషన్ అయ్యింది. సినిమా ఇండస్ట్రీ మొదలుకొని రాజకీయాల వరకు పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్లు, మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై మాట్లాడుతూ అధికార పార్టీ వైసీపీపై విమర్శలు గుప్పించారు.

Pawan Kalyan : సినీ ప‌రిశ్ర‌మ‌కు ఇబ్బందులు క‌లిగిస్తే తాట తీస్తా – పవన్ కళ్యాణ్ ఘాటు హెచ్చరిక

ఏపీలో సినిమా థియేట‌ర్లు ఎందుకు తెరుచుకోవ‌డం లేద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ నిల‌దీశారు. ప్ర‌భుత్వ ఖ‌జానాలో డ‌బ్బుల్లేనందు వ‌ల్లే సినిమా టికెట్లు ప్ర‌భుత్వ‌మే విక్ర‌యిస్తున్న‌ద‌ని అన్నారు. ఇక సీనియర్ నటుడు మోహన్ బాబు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బంధువేనని.. సినిమా పరిశ్రమ ఇబ్బందులను ఆయన జగన్ మోహన్ రెడ్డికి చెప్పాలని అన్నారు.
పవన్ వ్యాఖ్యలపై మోహన్ బాబు స్పందించారు. ట్విట్టర్‌లో ఓ లేఖను షేర్ చేశారు.

సాయితేజ్ ఇంకా కళ్లు తెరవలేదు.. కోమాలో ఉన్నాడు

‘నా చిరవాల మిత్రుని సోదరుడైన పవన్ కళ్యాణ్ నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంత సంబోధించాను. పవన్ కళ్యాణ్ గారు అనడంలో తప్పేమీ లేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్. సంతోషమే. ఇప్పుడు ‘మా’ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడు అన్న సంగతి నీకు తెలిసిందే. అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకి నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని.. నీ అమూల్యమైన ఓటుని సోదర సమానుడైన విష్ణు బాబుకి, అతని ప్యానెల్‌కి వేసి వాళ్లని గెలిపించాలని కోరుకుంటున్నాను.. థ్యాంక్యూ వెరీమచ్’..