Kondapolam : రివ్యూ..

పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ హీరో హీరోయిన్లుగా టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ రూపొందించిన ‘కొండపొలం’ మూవీ రివ్యూ..

Kondapolam : రివ్యూ..

Kondapolam

Kondapolam: ఫస్ట్ సినిమా ‘ఉప్పెన’ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ నటించిన రెండో చిత్రం ‘కొండపొలం’.. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో.. బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద సాయి బాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి నిర్మించారు. రకుల్ ప్రీత్ కథానాయిక. ప్రోమోలన్నీ ప్రామిసింగ్‌గా అనిపించడంతో పాటు సినిమా మీద అంచనాలు పెంచేసాయి. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కొండపొలం’ ఎలా ఉందో చూద్దాం..

SPIRIT : పవర్‌ఫుల్ పోలీస్‌గా ప్రభాస్..

కథ..
కటారి రవీంద్రనాథ్ అలియాస్ రవి (వైష్ణవ్ తేజ్) తల్లిదండ్రులు గొర్రెల కాపరులు.. ఉన్నవాటిలో సగం గొర్రెలను అమ్మేసి కొడుకును బాగా చదివిస్తారు. ఎంత ప్రయత్నించినా ఇంటర్వూలంటే భయం కారణంగా ప్రతి ఇంటర్వూలోనూ ఫెయిల్ అవుతూ.. నాలుగేళ్లుగా ఉద్యోగం రాకపోవడంతో అతనితో పాటు కుటంబ సభ్యులు కూడా నిరాశతో ఉంటారు. వర్షాలు పడకపోవడం, గ్రామంలో నీటికొరతతో తమకు జీవానాధారమైన గొర్రెలకు తాగునీటి కోసం ‘కొండపొలం’ వెళ్లాలని రవి తండ్రి, బంధువులు నిర్ణయించుకోవడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో తండ్రి వెంట రవి కూడా ఆ ప్రాంతానికి బయలుదేరతాడు. ఓబులమ్మ (రకుల్ ప్రీత్) కూడా తన తాతతో కలిసి వస్తుంది. రవి, కర్రని చూసి కూడా పాము అనుకునే భయస్థుడు కావడంతో ఓబులమ్మ అతణ్ణి ఆట పట్టిస్తుంటుంది. మెల్లగా ఇద్దరి మధ్య ఇష్టం కలుగుతుంది కానీ ఎప్పుడూ చెప్పుకోరు. ‘కొండపొలం’ వెళ్లిన తర్వాత వాళ్లకు ఎదురైన పరిస్థితులేంటి.. అసలు రవికి పెద్ద నక్క (పులులతో) పోరాడేంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది.. తను అనుకున్నట్లు ఉద్యోగం సంపాదించాడా.. రవి, ఓబులమ్మ ఒక్కటయ్యారా, లేదా? అనేది మిగతా కధ..

Kajal Aggarwal : ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ కమింగ్ సూన్?

నటీనటులు..
‘ఉప్పెన’ తో నటుడిగా ఆకట్టుకున్న వైష్ణవ్.. ఈ సినిమాతో మరింతగా అలరించాడు. పర్ఫార్మెన్స్‌తో పాటు చక్కటి హావభావలతో ఆకట్టుకున్నాడు. ఓబులమ్మగా రకుల్ ప్రీత్ చాలా బాగా నటించింది. గ్రామీణ యువతిగా ఆమె పాత్రకు న్యాయం చేసింది. రవి తండ్రిగా సాయి చంద్ ఎప్పటిలానే తన స్టైల్ నేచురల్ పర్ఫార్మెన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో తనకిచ్చిన పాత్రలో జీవించేశారు. హేమ, రవి ప్రకాష్, మహేష్ విట్టా తదితరుల క్యారెక్టర్స్ ఆకట్టుకుంటాయి.

Kondapolam Movie

టెక్నీషియన్స్..
‘కొండపొలం’ అనే పుస్తకం చదివాక దాన్ని సినిమాగా మలచాలనే క్రిష్ ఆలోచన అద్భుతం. సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నా కానీ.. పుస్తకాన్ని కథగా తీర్చిదిద్దడంతో పాటు అవసరమైన క్యారెక్టర్లను భావోద్వేగభరితంగా రూపొందించారు. అడవి అందాలను, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు కల్మషం లేని మనుషుల్ని చూపించారు. వర్షాలు రాక, నీళ్లు లేక మూగజీవాల కోసం వారు పడే ఆవేదనను, అడవిని అమ్మలా ప్రేమించే విధానాన్ని ఆకట్టుకునేలా చూపించారు. గొర్రెలను దొంగిలించే ముఠా, అడవిని నాశనం చేసే కర్కశకులు, క్రూరమృగాల ద్వారా ఎదురైన ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు చూపించారు. జ్ఞానశేఖర్ కెమెరా పనితనం సినిమాకు మరింత అందం తీసుకొచ్చింది. కీరవాణి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు వెన్నుముకలా నిలిచాయి. ఎడిటింగ్ మొదలుకుని మిగతా టెక్నీషియన్స్ అందరూ చక్కటి ఎఫర్ట్‌తో పని చేశారు.

Mahesh Babu : సూపర్‌స్టార్ స్టైలిష్ స్వెటర్ కాస్ట్ ఎంతంటే!

ఓవరాల్‌గా..
‘అడవికి అందరం బిడ్డలమే.. రావాలా, నాలుగు పూటలుండాలా.. నాలుగు బుక్కలు తినేసి పోవాలా.. అంతే కానీ చెట్టు, పుట్టా కొట్టుకుంటూ పోతే తర్వాతి తరానికి అంగుళం అడవి కూడా మిగలదు’.. అంటూ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూనే.. భయస్థుడయిన కథానాయకుడు అడవి నుంచి ఏం నేర్చుకుని, కసిగా ప్రయత్నించి తమకు అమ్మ లాంటి అడవిని కాపాడుకోవడానికి ఫారెస్ట్ ఆఫీసర్ అయ్యాడు అనే స్పూర్తివంతమైన విషయాలతో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా ‘కొండపొలం’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.