ManiRathnam : సిద్ శ్రీరామ్ హీరోగా మణిరత్నం సినిమా??

అయితే ప్రస్తుతం సిద్ శ్రీరామ్ గురించి ఓ వార్త తమిళ మీడియాలో బాగా వినిపిస్తుంది. స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'కడలి' సినిమాతోనే సిద్‌ శ్రీరామ్‌ గాయకుడిగా సినీ.....

ManiRathnam : సిద్ శ్రీరామ్ హీరోగా మణిరత్నం సినిమా??

Manirathnam

Sid Sriram :  ప్రస్తుతం బాగా ఫామ్ లో ఉన్న సింగర్, డిమాండ్ ఉన్న సింగర్ సిద్ శ్రీరామ్. ఇటీవల సిద్ పాట లేకుండా సినిమా రావట్లేదు. ఫిలిం మేకర్స్ కూడా సినిమాలో సిద్ శ్రీరామ్ సాంగ్ ఉంటే సినిమాకి కూడా హైప్ వస్తుందని నమ్ముతున్నారు. దీంతో సిద్ డిమాండ్ చేసినంత ఇచ్చి అతనితో పాడించుకుంటున్నారు. ఆ పాటలు కూడా బాగా వైరల్ అవుతుండటంతో సిద్ క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. సిద్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే పెరిగింది కూడా.

RGV : ఫిల్మ్ మేకర్ గానే కలవడానికి వచ్చాను.. పరిశ్రమ తరపున రాలేదు

అయితే ప్రస్తుతం సిద్ శ్రీరామ్ గురించి ఓ వార్త తమిళ మీడియాలో బాగా వినిపిస్తుంది. స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘కడలి’ సినిమాతోనే సిద్‌ శ్రీరామ్‌ గాయకుడిగా సినీ పరిశ్రమకి పరిచయమయ్యాడు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే సిద్ శ్రీరామ్, మణిరత్నం మధ్య దీనికి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్‌ కూడా విన్నారని, కథ నచ్చడంతో హీరోగా చేయడానికి సిద్‌ శ్రీరామ్‌ కూడా ఓకే చెప్పినట్టు తమిళ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. ఇదే కనుక నిజమైతే మరో యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ తో మణిరత్నం సిద్ ని హీరోగా వెండితెరకు పరిచయం చేయడం ఖాయం.