Siddharth – Aditi : ముంబై వీధుల్లో ప్రేమ జంట.. సిద్దార్ద్, అదితి రావు!

గత కొన్నాళ్లుగా హీరో సిద్దార్ద్, హీరోయిన్ అదితి రావు డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ముంబైలో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మీడియాకి అనేకసార్లు చిక్కిన ఈ జంట.. తాజాగా మరోసారి కెమెరా లెన్స్ కి చిక్కింది.

Siddharth – Aditi : ముంబై వీధుల్లో  ప్రేమ జంట.. సిద్దార్ద్, అదితి రావు!

Siddharth – Aditi

Siddharth – Aditi : గత కొన్నాళ్లుగా హీరో సిద్దార్ద్, హీరోయిన్ అదితి రావు డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ మహాసముద్రం సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారడంతో అప్పటి నుంచి సహజీవనం చేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఒకరి బర్త్ డేకి ఒకరు ప్రేమతో పోస్ట్ లు చేయడం ఆ వార్తలకు నిజం చేకూర్చాయి. అంతేకాదు ఇద్దరు కలిసి పార్టీలకు, డిన్నర్స్ కి వెళ్తూ.. ముంబైలో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మీడియాకి అనేకసార్లు చిక్కారు.

Siddharth – Aditi : శర్వా నిశ్చితార్థంలో వీరిని గమనించారా? మరోసారి వైరల్ అవుతున్న ఈ జంట..

తాజాగా మరోసారి కెమెరా లెన్స్ కి చిక్కింది ఈ జంట. సోమవారం (ఫిబ్రవరి 20) మధ్యాహ్నం ముంబైలోని ఒక రెస్టారెంట్ లో తళుక్కుమన్నారు. అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఒకే కారులో వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఇటీవల టాలీవుడ్ హీరో శర్వానంద్ పెళ్లి లో కూడా వీరిద్దరూ కలిసి హాజరయ్యారు. ఇలా ఎక్కడ కనిపించిన జంటగా కనిపిస్తుండడంతో.. ప్రేమలో ఉన్నారా అని అడిగినా, ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మాట దాటేస్తున్నారు ఇద్దరు.

అయితే కొందరు సన్నిహితులు మాత్రం వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే చెబుతున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో శర్వానంద్ వీరిద్దరి రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ ఇండైరెక్ట్ గా అవును వాళ్ళు డేటింగ్ లో ఉన్నారేమో అంటూ కామెంట్స్ చేశాడు. మరి వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారా? లేదా? అనేది పెద్ద ప్రశ్న గానే ఉంది. కాగా సిద్దార్ద్ కి ఇప్పటికే పెళ్లి అయ్యి విడాకులు తీసుకోగా, సమంతతో కూడా ప్రేమాయణం నడిపి విడిపోయాడు.

 

View this post on Instagram

 

A post shared by TAHIR JASUS007 (@tahirjasus)