Dhanush Movie: ఆ రోజే ‘సార్’ టీజర్ రిలీజ్.. ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్

తమిళ స్టార్ హీరో ధనుష్ ‘వాతి’ అనే టైటిల్ తో తమిళంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులోనూ నేరుగా రిలీజ్ చేయనున్నారు. తెలుగులో విడుదలయ్యే సినిమాకు ‘సార్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రిలీజ్ చేసే తేదీలను చిత్ర యూనిట్ ప్రకటించింది.

Dhanush Movie: ఆ రోజే ‘సార్’ టీజర్ రిలీజ్.. ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్

Dhanush Movie: తమిళ స్టార్ హీరో ధనుష్ ‘వాతి’ అనే టైటిల్ తో తమిళంలో సినిమా చేస్తున్నారు. తమిళంలో ధనుష్ కు అభిమాన ఘనం ఎక్కువే. ఆయన క్రేజ్ గురించి చెప్పుకోవాల్సిన పనిలేదు. తెలుగులోనూ ధనుష్ హీరోగా నటించిన పలు సినిమాలు విడుదలయ్యాయి. ఆ సినిమాలకు మంచి ఆదరణ లభించింది. తాజాగా తమిళంలో హీరోగా ధనుష్ చేస్తున్న ‘వాతి’ సినిమాను తెలుగులోనూ నేరుగా రిలీజ్ చేయనున్నారు. తెలుగులో విడుదలయ్యే సినిమాకు ‘సార్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

Chiranjeevi: కైకాల సత్యనారాయణ ఇంటికెళ్లి బర్త్‌డే కేక్ కట్ చేయించిన మెగాస్టార్

సీతార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ధనుష్ తో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న విషయం విధితమే. ఈ సినిమాలో బీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్తా మీనాన్ కథానాయికిగా నటిస్తోంది. సినిమాటోగ్రాఫర్ దినేష్ కృష్ణన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. జీ.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.

తమిళంలో ‘వాతి’, తెలుగులో ‘సార్’ గా విడుదలయ్యే ఈ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల తేదీలను చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ మేరకు హీరో ధనుష్ తన ట్విటర్ ఖాతాలో తేదీలను వెల్లడించారు. ఈ నెల 27న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్  చేయనున్నారు. మరుసటి రోజు హీరో ధనుష్ పుట్టిన రోజును పురస్కరించుకొని 28వ తేదీన మువీ టీజర్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించింది.