Chiranjeevi: కైకాల సత్యనారాయణ ఇంటికెళ్లి బర్త్‌డే కేక్ కట్ చేయించిన మెగాస్టార్

కైకాల పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కైకాల ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. కైకాలతో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో బర్త్ డే కేక్ కట్ చేయించారు.

Chiranjeevi: కైకాల సత్యనారాయణ ఇంటికెళ్లి బర్త్‌డే కేక్ కట్ చేయించిన మెగాస్టార్

Kaikala Satyanarayana

Chiranjeevi: సినీ ఆర్టిస్టు కైకాల సత్యనారాయణ నివాసాని వెళ్లి కైకాలకు ఆయన కుటుంబ సభ్యులకు మెగాస్టార్ చిరంజీవి బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. సోమవారం కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు. కైకాల హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు గా సుమారు 700పైగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. వృద్ధాప్యంలో ఇంటిలోనే చికిత్స పొందుతూ లేవలేని పరిస్థితుల్లో కైకాల ఉన్నారు.

Chiranjeevi: మెగాస్టార్ నయా ప్లాన్.. ఫ్యాన్స్‌కు పండగే!

కైకాల పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కైకాల ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. కైకాలతో వారి కుటుంబ సభ్యుల సమక్షంలో బర్త్ డే కేక్ కట్ చేయించారు. కైకాల అనారోగ్యంతో లేవలేని పరిస్థితుల్లో ఉండటంతో బెడ్ పై పడుకొనే కేక్ కట్ చేశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను చిరంజీవి తన ట్విటర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు.

‘పెద్దలు కైకాల సత్యనారాయణగారి పుట్టినరోజున వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి ట్విటర్ లో పేర్కొన్నారు. గతేడాది శ్వాసకోశ సంబంధిత సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డ కైకాల ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ప్రస్తుతం ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నారు.