Bandi Bhagirath Case: బాధితురాలి పుట్టిన తేదీపై విచారణ జరపండి- బండి భగీరథ్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
బాలిక తల్లి తప్పుడు రికార్డ్స్ సృష్టించి వయసు తగ్గించి కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయించారని కోర్టుకి విన్నవించారు.
Bandi Bhagirath Case: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ దాఖలు చేసిన మధ్యంతర రక్షణ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. రేపు సీపీ వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఇటు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వారానికి వాయిదా వేసింది. ఈలోగా అరెస్ట్ చేయకుండా ఉండాలని బండి భగీరథ్ తరపు లాయర్ కోరగా మధ్యంతర రక్షణ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు.
ఇక, ఈ కేసులో పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది కోర్టు. బాధితురాలు పుట్టిన తేదీపై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో పిటీషనర్ తరపున సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 11 నిర్దేశించిన వాటి పరిధిలోకి పిటిషనర్ రాదని, BNS సెక్షన్ 74, 75 ఆరోపించబడిన నేరాలు రుజువు కాలేదని చెప్పారు.
బాధితురాలిగా చెబుతున్న బాలిక వయసు 19 నుంచి 20 మధ్య ఉంటుందని కోర్టుకి తెలియజేశారు. బాలిక తల్లి తప్పుడు రికార్డ్స్ సృష్టించి వయసు తగ్గించి కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయించారని కోర్టుకి విన్నవించారు. 8 నెలల కింద జరిగిన సంఘటనపై ఇప్పుడు ఫిర్యాదు చేయడంలో దురుద్దేశం ఉందన్నారు. వాదనలు విన్న కోర్టు.. బాలిక మైనర్ కాదు అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉంటే సమర్పించండి అని ఆదేశించింది.
Also Read: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఆ మూడు జిల్లాల ప్రజలకు శుభవార్త..
