Puneeth Rajkumar : పునీత్ సినిమా కోసం శివ రాజ్ కుమార్

తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ కోసం రంగంలోకి దిగుతున్నారు అన్నయ్య శివ రాజ్ కుమార్..

Puneeth Rajkumar : పునీత్ సినిమా కోసం శివ రాజ్ కుమార్

Siva Rajkumar

Puneeth Rajkumar: కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ షాక్‌కి గురైంది. సినీ నటుడిగానే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ తెరవెనుక కూడా రియల్ హీరో అనిపించుకున్న పునీత్ ఇక లేరు అనే వార్తతో అభిమానులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Puneeth Rajkumar: పునీత్‌రాజ్ కుమార్ మరణం తట్టుకోలేక అభిమానుల ఆత్మహత్యాయత్నం

తెలుగు ఇండస్ట్రీ నుండి బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, శ్రీకాంత్, వెంకటేష్, ఆలీ, రానా దగ్గుబాటి తదితరులు బెంగుళూరు చేరుకుని కంఠీరవ స్టేడియంలో పునీత్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. పునీత్ సోదరుడు, కరునాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్‌కు ధైర్యం చెప్పారు.

Puneeth Rajkumar : బాబాయ్ – అబ్బాయ్ భావోద్వేగం..

పునీత్ అకాల మరణంతో ఆయన నటిస్తున్న సినిమాల పరిస్థితి ఏంటి అనే విషయం కన్నడ ఇండస్ట్రీల్ హాట్ టాపిక్‌గా మారింది. పునీత్ నటించగా దాదాపు పూర్తి కావొచ్చిన ‘జేమ్స్’ సినిమాకి సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది. పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జేమ్స్’ సినిమాలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ శ్రీకాంత్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ప్రియా ఆనంద్ కథానాయిక. చేతన్ కుమార్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తయ్యింది. దీపావళి కానుకగా టీజర్ రిలీజ్ చెయ్యాలనుకున్నారు. అలాగే నవంబర్ 8 నుండి సాంగ్ పిక్చరైజేషన్ ప్లాన్ చేశారు.

Puneeth Rajkumar : శివన్నను ఓదార్చిన చిరంజీవి – వెంకటేష్

షూటింగ్ అయితే పూర్తయ్యింది. కానీ డబ్బింగ్ ఇంకా స్టార్ట్ చెయ్యలేదు. కట్ చేస్తే.. తమ్ముడు సినిమా కోసం అన్న శివ రాజ్ కుమార్ రంగంలోకి దిగబోతున్నారని శాండల్‌వుడ్ ఇండస్ట్రీ వర్గాల వారు చెప్తున్నారు. పునీత్ క్యారెక్టర్‌కి శివన్న వాయిస్ ఇవ్వబోతున్నారట. తనకు ‘రాజ కుమార’, ‘యువరత్న’ వంటి హిట్ సినిమాలు ఇచ్చిన దర్శకుడు సంతోష్ ఆనంద్ రామ్‌తోనూ ఒక సినిమా ఫిక్స్ చేశారు పునీత్. నవంబర్ లేదా డిసెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ చెయ్యాలనుకున్నారు. ఇంతలోనే పునీత్ రాజ్ కుమార్ మరణించారు.

James Movie