Puneeth Rajkumar : బాబాయ్ – అబ్బాయ్ భావోద్వేగం..

పునీత్‌ కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని.. బాలకృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు..

Puneeth Rajkumar : బాబాయ్ – అబ్బాయ్ భావోద్వేగం..

Balakrishna Jr Ntr

Puneeth Rajkumar: కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నట వారసుడు, కరునాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ సోదరుడు.. పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 46 సంవత్సరాలు. పునీత్‌కు భార్య అశ్విని రేవంత్, కుమార్తెలు ధృతి, వందిత ఉన్నారు.

Puneeth Rajkumar : వయసులో చిన్న.. వ్యక్తిత్వంలో మిన్న.. తండ్రిలానే కళ్లు దానం చేసిన పునీత్ రాజ్ కుమార్..

ఆదివారం (అక్టోబర్ 31) కంఠీరవ స్టూడియోలో రాజ్ కుమార్ సమాధి పక్కనే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరుగనున్నాయి. పునీత్‌ను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు కంఠీరవ స్టేడియంకు చేరుకున్నారు. తెలుగు ఇండస్ట్రీ నుండి రాజ్ కుమార్ కుటుంబంతో ఎంతో అనుబంధం కలిగిన నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పునీత్‌ను కడసారి చూసేందుకు బెంగుళూరు వెళ్లారు.

Kannada Power Star : పునీత్ రాజ్ కుమర్ హాఠాన్మరణం, గుండెపోటుతో అభిమాని మృతి

రాజ్ కుమార్ కుటంబానికీ, నందమూరి ఫ్యామిలీకీ మధ్య మంచి రిలేషన్ ఉంది. సీనియర్ ఎన్టీఆర్ – రాజ్ కుమార్ నుండి జూనియర్ ఎన్టీఆర్ – పునీత్ రాజ్ కుమార్ల వరకు మూడు తరాలుగా వీరిది విలువైన బంధం. సీనియర్ ఎన్టీఆర్ – రాజ్ కుమార్ సోదరుల్లా మెలిగారు. వారి తర్వాత వారి వారసులు నందమూరి బాలకృష్ణ – శివ రాజ్ కుమార్, వారి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ – పునీత్ రాజ్ కుమార్ల మధ్య మంచి బాండింగ్ ఉంది. బాలయ్య 100వ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లో శాతకర్ణి జీవిత చరిత్రను వివరించే పాటలో కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శివన్న.

పునీత్ పార్థివ దేహాన్ని చూసి శివన్నను హత్తుకుని భావోద్వేగంతో బాలయ్య కంటతడి పెట్టారు. ఎప్పుడూ హుందాగా, గంభీరంగా కనబడే బాలయ్య భావోద్వేగంతో కంటతడి పెట్టడంతో అభిమానులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పునీత్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. శివన్నకు ధైర్యం చెప్పారు. తారక్ – పునీత్ మధ్య మంచి స్నేహబంధం ఉంది. పునీత్ ‘చక్రవూహ్యా’ సినిమాలో ‘గెలయా గెలయా’ అనే పాట పాడాడు ఎన్టీఆర్. పునీత్‌కు నివాళులర్పిస్తూ బాబాయ్ – అబ్బాయ్ భావోద్వేగానికి గురైన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.