Pushpa-Viral Video: వామ్మో.. బన్నీ హుక్ స్టెప్ దింపేసిన బుడ్డోడు!

అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చేసిన సినిమా పుష్ప. ఇందులో బన్నీ యాక్టింగ్, మేకోవర్, డాన్స్ ఇండియా మొత్తం తెగ నచ్చేసింది. ఇక ఈ సినిమాలో పాటలు, డాన్స్ అయితే షేక్ చేసేశాయి

Pushpa-Viral Video: వామ్మో.. బన్నీ హుక్ స్టెప్ దింపేసిన బుడ్డోడు!

Pushpa Viral Video

Pushpa-Viral Video: అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చేసిన సినిమా పుష్ప. ఇందులో బన్నీ యాక్టింగ్, మేకోవర్, డాన్స్ ఇండియా మొత్తం తెగ నచ్చేసింది. ఇక ఈ సినిమాలో పాటలు, డాన్స్ అయితే షేక్ చేసేశాయి. గతంలో అల వైకుంఠపురంలో బుట్టబొమ్మ తర్వాత పుష్పలో శ్రీవల్లి పాట.. అందులో బన్నీ హుక్ స్టెప్ ఎంతో పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హుక్ స్టెప్ షాట్ వీడియోలే కనిపిస్తున్నాయి.

Trivikram Heroines: నచ్చితే చాలు.. హీరోయిన్స్ ను రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్!

సామాన్య ప్రేక్షకుల నుండి సెలబ్రిటీల వరకు.. క్రికెటర్ల నుండి వయసైపోయిన ముసలి జంటల వరకు కూడా ఈ హుక్ స్టెప్ కి డాన్స్ చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. కాగా.. ఇప్పుడు ఓ బుడ్డోడు శ్రీవల్లి పాటకి స్టెప్పేస్తూ చేసిన వీడియో ఒకటి సామజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది. నిండా ఏడాది కూడా వయసులేని ఈ బుడ్డోడు బన్నీని దింపేస్తూ వేసిన స్టెప్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది.

Ashoka Vanam Lo Arjuna Kalyanam: కళ్యాణం డేట్ ఫిక్స్.. చూసేందుకు మీరు సిద్ధమా?

టీవీలో శ్రీవల్లి పాట వస్తుండగా.. అందులో బన్నీని చూస్తూ ఈ బుడ్డోడు కూడా భుజం పైకెత్తి చూట్టు తిరుగుతూ సిగ్నేచర్ స్టెప్ వేయడం స్టార్ట్‌ చేశాడు. అలా అలా ఓ రౌండ్ కొట్టేసిన బుడ్డోడు స్టెప్ సంగతేమో కానీ బన్నీ మేనరిజాన్ని మాత్రం ఈ వయసులోనే ఇమిటేట్ చేయడం నెటిజన్లకు తెగ ముచ్చటేస్తుంది. ఈ ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వైరల్‌ వీడియోలో బుడ్డోడిని చూసి అంతా ఫిదా అవుతూ తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తున్నారు.