Trivikram Heroines: నచ్చితే చాలు.. హీరోయిన్స్ ను రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్!

కలిసొచ్చిన హీరోయిన్ అని, కెమిస్ట్రీ బాగా కుదిరిన భామ అని, గోల్డెన్ లెగ్ అని, లక్కీ ఛామ్ అని హీరోయిన్స్ ని సినిమాల్లో రిపీట్ చేస్తుంటారు డైరెక్టర్లు. లేటెస్ట్ గా త్రివిక్రమ్..

Trivikram Heroines: నచ్చితే చాలు.. హీరోయిన్స్ ను రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్!

Trivikram Heroines

Trivikram Heroines: కలిసొచ్చిన హీరోయిన్ అని, కెమిస్ట్రీ బాగా కుదిరిన భామ అని, గోల్డెన్ లెగ్ అని, లక్కీ ఛామ్ అని హీరోయిన్స్ ని సినిమాల్లో రిపీట్ చేస్తుంటారు డైరెక్టర్లు. లేటెస్ట్ గా త్రివిక్రమ్ తనకు నచ్చిన హీరోయిన్స్ ని తెగ రిపీట్ చేస్తున్నారు. అంతేకాదు.. త్రివిక్రమ్ కి నచ్చితే ఆ హీరోయిన్ కి ఇక అవకాశాలకోసం వెయిట్ చేసే పనిలేదని, బంపర్ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయని టాలీవుడ్ నడుస్తోంది.

Khiladi మరో సాంగ్ రిలీజ్.. క్యాచ్ మీ అంటూ ఇరగదీసిన డింపుల్!

సినిమాలో హీరోయిన్ పోర్షన్ ఉండేది తక్కువే అయినా.. హీరోయిన్ సెలక్షన్ కి మాత్రం టైమ్ తీసుకుంటారు డైరెక్టర్లు. త్రివిక్రమ్ తన సినిమాల్లో హీరోయిన్ ని చాల స్పెషల్ గా చూపిస్తారు. హీరోతో పాటు ఈక్వల్ స్పేస్ లేకపోయినా.. ఇంపార్టెన్స్ మాత్రం ఎక్కువగానే ఇస్తారు. అందుకే త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్లకి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. త్రివిక్రమ్ కూడా తనకు బాగా కలిసొచ్చిన హీరోయిన్ ని రిపీట్ చేస్తూ ఉంటారు. లేటెస్ట్ గా మూడేళ్ల నుంచి తన లక్కీ ఛామ్ అయిన పూజాహెగ్డే తో ముచ్చటగా మూడోసారి సినిమా చెయ్యడానికి రెడీ అయ్యారు త్రివిక్రమ్.

Tamil Film Releases: వరసగా రిలీజ్.. సినిమాలతో తమిళ తంబీల దండయాత్ర!

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ లేటెస్ట్ గా మహేష్ బాబుతో తన హ్యాట్రిక్ మూవీని స్టార్ట్ చేశారు. ఈసినిమాలో హీరోయిన్ మరోసారి ఛాన్స్ దక్కించుకుంది పూజాహెగ్డే. అంతేకాదు త్రివిక్రమ్ పూజాహెగ్డేతో వరసగా మూడో సినిమా చేస్తున్నారు. త్రివిక్రమ్.. అజ్ఞాతవాసి సినిమా తర్వాత.. ఎన్టీఆర్ తో చేసిన అరవిందసమేత సమేతలో చేసి త్రివిక్రమ్ కి అదిరిపోయే హిట్ ఇచ్చింది పూజాహెగ్డే.

Boney Kapoor: బాలీవుడ్ షో మ్యాన్ మూవీ ప్లానింగ్.. విడుదలకి ఐదు సినిమాలు!

ఫస్ట్ మూవీలో ముద్దుముద్దుగా డబ్బింగ్ కూడా చెప్పి ఆడియన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేసిన పూజాహెగ్డే.. త్రివిక్రమ్ తో బ్యాక్ టూ బ్యాక్ అలవైకుంఠపురంలో నటించే ఛాన్స్ కూడా దక్కించుకుంది. బన్నీ, పూజాహెగ్డే కాంబినేషన్ తో అలవైకుంఠపురంలో సినిమా సక్సెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ మ్యాసివ్ బ్లాక్ బస్టర్ తో పూజాని తన లక్కీచామ్ గా త్రివిక్రమ్ కూడా ఫిక్స్ అయిపోయారు. అందుకే వరస పెట్టి తను చేస్తున్న ప్రతి సినిమాలో ఛాన్సిస్తూ ఇక వేరే సినిమా ఆఫర్ల కోసం వెయిట్ చేసే పనిలేకుండా చేస్తున్నారు.

Janhvi Kapoor: పూల్ ఒడ్డున జాన్వీ బికినీ షో!

త్రివిక్రమ్.. ఓన్లీ పూజాహెగ్డేని మాత్రమే రిపీట్ చెయ్యడం లేదు. తనను నచ్చిన ఏ హీరోయిన్ ని అయినా లిఫ్ట్ చేస్తూనే ఉంటారు. త్రివిక్రమ్ సినిమా అంటే హీరో ఎవరైనా సరే.. తనకు నచ్చిన హీరోయిన్ ని తెచ్చి మ్యాచ్ చేసేస్తారు. పూజాహెగ్డే కంటే ముందు.. సమంతను కూడా ఇలాగే రిపీట్ చేశారు త్రివిక్రమ్.

Mahesh Babu: ఝల్లుమనిపించే కొత్త యాడ్‌లో మహేశ్.. బుర్జ్‌ ఖలీఫాపై నుంచి బైక్‌తో స్టంట్

సమంతాని కూడా మూడు సార్లు తన సినిమాల్లో రిపీట్ చేశారు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ తో చేసిన అత్తారింటికి దారేది సినిమాలో సూపర్ గా కనెక్ట్ అయిన సమంతా త్రివిక్రమ్ కి మంచి హిట్ అందించింది. సమంత సింప్లిసిటీకి, త్రివిక్రమ్ సెన్సాఫ్ హ్యూమర్ మ్యాచ్ అవ్వడంతో ఇద్దరి కాంబినేషన్ లో వర్క్ కంఫర్ట్ ఎక్కువే. అందుకే సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో సమంతాని బన్నీకి జంటను చేసి మ్యాజిక్ చూపించారు.

Mahesh-Vijay Devarakonda: మహేశ్ వర్సెస్ విజయ్.. పోటాపోటీ యాడ్స్!

ఈ రెండు సినిమాల సక్సెస్ తో ఆపకుండా సమంతతో మరోసారి సినిమా రిపీట్ చేశారు త్రివిక్రమ్. ఇద్దరు స్టార్ హీరోలతో సమంతకి ఛాన్సిచ్చి.. నితిన్ తో అ,ఆ సినిమాలో ముచ్చటగా మూడోసారి సమంతాని తన కాంబినేషన్లో చూపించారు త్రివిక్రమ్. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో సమంతా ఇంకా ఎలివేట్ అయ్యింది.

Siri-Srihan : సిరి, శ్రీహన్ విడిపోలేదు.. ఇదే సాక్ష్యం

పూజాహెగ్డే, సమంతకు వరసగా మూడు సినిమాలు ఛాన్సిచ్చిన త్రివిక్రమ్.. మరో క్యూట్ హీరోయిన్ ఇలియానాని రెండు సార్లు రిపీట్ చేశారు. ఈ గోవా బ్యూటీని జల్సా తో ఆడియన్స్ కి బాగా ఎంగేజ్ చేసిన త్రివిక్రమ్.. జులాయిలో అల్లు అర్జున్ కి జంటగా మరో ఆఫర్ ఇచ్చారు. ఇలా ఇలియానాతో కూడా రెండు సినిమాలు రిపిట్ చేశారు త్రివిక్రమ్.