Tamil Film Releases: వరసగా రిలీజ్.. సినిమాలతో తమిళ తంబీల దండయాత్ర!

ఇప్పుడిప్పుడే కోవిడ్ సిచ్యువేషన్స్ నార్మల్ అవుతున్నాయి. మేకర్స్ అందరూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు.

Tamil Film Releases: వరసగా రిలీజ్.. సినిమాలతో తమిళ తంబీల దండయాత్ర!

Tamil Film Releases

Tamil Film Releases: ఇప్పుడిప్పుడే కోవిడ్ సిచ్యువేషన్స్ నార్మల్ అవుతున్నాయి. మేకర్స్ అందరూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. తమిళ్ హీరోలు కూడా ఏమాత్రం లేట్ చెయ్యకుండా తమ సినిమాల్ని రిలీజ్ చెయ్యడానికి రెడీ అయిపోయారు. నెలకో సినిమాతో ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యడానికి సిద్దమయ్యారు స్టార్ హీరోలు.

Tamil Film Releases: వరసగా రిలీజ్.. సినిమాలతో తమిళ తంబీల దండయాత్ర!

తమిళ్ హీరోలు కూడా సినిమాల రిలీజ్ కు రెడీ అయ్యారు. కొన్నాళ్ల నుంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలకు ఫైనల్లీ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. విశాల్ తన అప్ కమింగ్ మూవీ సామాన్యుడు సినిమాని జనవరి నంచి పోస్ట్ పోన్ చేసుకుని ఈ వారంలోనే రిలీజ్ చేశారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఫిబ్రవరి 4న రిలీజ్ అయింది సామాన్యుడు మూవీ.

Boney Kapoor: బాలీవుడ్ షో మ్యాన్ మూవీ ప్లానింగ్.. విడుదలకి ఐదు సినిమాలు!

ఈ వారం విశాల్ ధియేటర్లోకొస్తే.. నెక్ట్స్ వీక్ మరో తమిళ్ స్టార్ హీరో విక్రమ్.. మూవీ మహాన్ ఓటీటీ లో రిలీజ్ అవుతోంది. విక్రమ్, తన కొడుకు ధృవ్ తో కలిసి చేసిన ఈ క్రేజీ మూవీ డైరెక్ట్ ఓటీటీకే వచ్చేస్తోంది. ఇద్దరి కాంబినేషన్ లో ఫస్ట్ టైమ్ తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 10న ఓటీటీ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యబోతోంది.

Pushpa-Akhanda: గడ్డు కాలంలో ఇండస్ట్రీకి బాసటగా అఖండ, పుష్ప!

యాక్షన్ హీరో అజిత్ కూడా తన సినిమాని ఈ నెలలోనే రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. అజిత్ హీరోగా కార్తికేయ విలన్ గా క్రేజీ రేసింగ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన వలిమై సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ కోవిడ్ తో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఫిబ్రవరి 24న తెలుగు, తమిళ్ ,కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది.

Janhvi Kapoor: పూల్ ఒడ్డున జాన్వీ బికినీ షో!

డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేసే సూర్య.. లాస్ట్ టూ ఇయర్స్ నుంచి సూపర్ హిట్లు కొడుతున్నారు. 2020లో ఆకాశమే నీహద్దురా, 2021లో జై భీమ్ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయినా కూడా అదిరిపోయే హిట్ కొట్టారు. చాలా గ్యాప్ తర్వాత సూర్య.. ధియేటర్లో రిలీజ్ చేస్తున్న సినిమా ఎతర్కుమ్ తునిందవన్. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ పాండిరాజా డైరెక్షన్లో ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా మార్చి 10న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.

Mahesh-Vijay Devarakonda: మహేశ్ వర్సెస్ విజయ్.. పోటాపోటీ యాడ్స్!

లేట్ అయినా లేటెస్ట్ గా సమ్మర్ హీట్ ని పెంచడానికి బీస్ట్ గా వస్తున్నాడు మరో స్టార్ హీరో విజయ్. పూజాహెగ్డే హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న బ్లాక్ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్.. విజయ్ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఏప్రిల్ 14న రిలీజ్ కు రెడీ అవుతోంది. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో విజయ్.. మాస్ హీరోగా కనిపించబోతున్నారు.