Boney Kapoor: బాలీవుడ్ షో మ్యాన్ మూవీ ప్లానింగ్.. విడుదలకి ఐదు సినిమాలు!

బాలీవుడ్ అగ్ర నిర్మాత, షో మ్యాన్ బోనీ కపూర్ మూవీ ప్లానింగ్ మామూలుగా లేదు. మిస్టర్ ఇండియా, రూప్ కీ రాణీ చోర్ం కా రాజా, నో ఎంట్రీ, జుదాయీ, వాంటెడ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు..

Boney Kapoor: బాలీవుడ్ షో మ్యాన్ మూవీ ప్లానింగ్.. విడుదలకి ఐదు సినిమాలు!

Boney Kapoor

Boney Kapoor: బాలీవుడ్ అగ్ర నిర్మాత, షో మ్యాన్ బోనీ కపూర్ మూవీ ప్లానింగ్ మామూలుగా లేదు. మిస్టర్ ఇండియా, రూప్ కీ రాణీ చోర్ం కా రాజా, నో ఎంట్రీ, జుదాయీ, వాంటెడ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన ఆయన ఇప్పుడు కూడా ఏ మాత్రం తగ్గకుండా అదే జోష్ మీదున్నారు. కాగా, ప్రస్తుతం అజిత్‌ కుమార్ హీరోగా జీ స్టూడియోస్‌ సంస్థ, బేవ్యూ ప్రాజెక్ట్స్‌ సంయుక్తంగా ‘వాలిమై’ సినిమాని నిర్మించారు. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతుంది.

Pushpa-Akhanda: గడ్డు కాలంలో ఇండస్ట్రీకి బాసటగా అఖండ, పుష్ప!

హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 24న విడుద‌ల చేస్తున్నారు. ఇదిలా ఉండగానే బోనీ కపూర్ మరో అయిదు భారీ ప్రాజెక్టులతో ఫుల్ జోష్ మీదున్నారు. 2022 మార్చ్ 9న హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో అజిత్‌ కుమార్ తో హ్యాట్రిక్ మూవీ ప్రారంభించనున్న బోనీ కపూర్.. అజయ్ దేవగన్ హీరోగా మైదాన్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఫుట్ బాల్ ఆట నేపథ్యంలో కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీద్ జీవిత కథ ఆధారంగా ‘మైదాన్’ తెరకెక్కుతోంది.

Janhvi Kapoor: పూల్ ఒడ్డున జాన్వీ బికినీ షో!

ప్రియమణి, గజరాజ్ రావ్ మైదాన్ లో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ‘బధాయి హో’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఏ ఆర్ రహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. పాండమిక్ కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాని 2022 జూన్ 3న హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో భారీగా స్థాయిలో విడుదల చెయ్యబోతున్నారు.

Mahesh-Vijay Devarakonda: మహేశ్ వర్సెస్ విజయ్.. పోటాపోటీ యాడ్స్!

ఇవి కాకుండా కోలీవుడ్ స్టార్ ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఆరి, తాన్యా రవి చంద్రన్, నటిస్తున్న తమిళ్ చిత్రం నెంజుకు నీది ఈ చిత్రానికి అరుణ్రాజా కామరాజ దర్శకుడు. బోనీ కపూర్ తనయ ఝాన్వి కపూర్, సన్నీ కౌశల్, మనోహ్ పహ్వ నటిస్తున్న హిందీ చిత్రం ‘మిళి’ ఈ చిత్రానికి దర్శకుడు జేవియర్ మాతుకుట్టి కాగా ఏ ఆర్ రహమాన్ మ్యూజిక్ డైరెక్టర్.

Mahesh Babu: దర్శకుడికి మహేష్ క్షమాపణలు.. ఎందుకో తెలుసా?

కోలీవుడ్ స్టార్ సత్యరాజ్, ఊర్వశి, ఆర్ జె బాలాజీ, అపర్ణ బాలమురళి నటిస్తున్న తమిళ్ చిత్రం ‘వీటిలా విషేషంగా’ ఈ చిత్రానికి దర్శకుడు ఆర్ జె బాలాజీ కాగా, గిరీష్ గోపాల కృష్ణన్ మ్యూజిక్ కంపోజర్. పైన పేర్కొన్న అయిదు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉండాగా.. అజిత్ తో హ్యాట్రిక్ సినిమాను 2022 మార్చ్ 9న ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట.