Pushpa-Akhanda: గడ్డు కాలంలో ఇండస్ట్రీకి బాసటగా అఖండ, పుష్ప!

కోవిడ్ భయంతో భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ ను వన్ బై వన్ వాయిదా వేసుకుంటున్నాయి. అలాంటి టైమ్ లో ధైర్యం చేసి, అఖండ ఆగమనం అంటూ థియేటర్లోకొచ్చాడు బాలకృష్ణ.

Pushpa-Akhanda: గడ్డు కాలంలో ఇండస్ట్రీకి బాసటగా అఖండ, పుష్ప!

Pushpa Akhanda

Pushpa-Akhanda: కోవిడ్ భయంతో భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ ను వన్ బై వన్ వాయిదా వేసుకుంటున్నాయి. అలాంటి టైమ్ లో ధైర్యం చేసి, అఖండ ఆగమనం అంటూ థియేటర్లోకొచ్చాడు బాలకృష్ణ. టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించాడు. ఆ తర్వాత రెండు వారాల గ్యాప్ లో తగ్గేదేలే అంటూ వచ్చాడు పుష్పరాజ్ బాలీవుడ్ లో కూడా సంచలనాలు క్రియేట్ చేశాడు. ఈ రెండు సినిమాలు 50 రోజులు పూర్తి చేసుకుని, భారీ వసూళ్లను సాధించి, ఇండస్ట్రీకే ధైర్యాన్నిచ్చాయి.

Pushpa: పుష్ప సినిమాపై టీఆర్ఎస్ నేత అనుచిత వ్యాఖ్యలు!

తగ్గేదేలే అంటూ లాస్ట్ ఇయర్ డిసెంబర్ 17న వరల్డ్ వైడ్ గా థియేటర్లో కొచ్చాడు పుష్పరాజ్. భారీ వసూళ్లు సాధించి, సౌత్ ఇండియా ఆడియన్స్ నుంచి, నార్త్ ఇండియా స్టార్స్ వరకు అందరికీ షాకిచ్చాడు. అసలే కోవిడ్ భయంతో గడ్డుకాలంలో ఉన్న ఇండస్ట్రీకి బాసటగా నిలిచాడు. అఖండ తర్వాత 50 రోజుల థియేట్రికల్ రన్ ను సాధించి, పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్ అంటూ పాన్ ఇండియా లెక్కలు మార్చేశాడు.

Mahesh-Vijay Devarakonda: మహేశ్ వర్సెస్ విజయ్.. పోటాపోటీ యాడ్స్!

పుష్ప కన్నా పదిహేను రోజుల ముందు వచ్చిన అఖండ బాలకృష్ణ కెరియర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టి టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రెండు వారాలు థియేటర్లో ఆడితేనే గొప్ప అనుకుంటున్న టైమ్ లో అదీ పాండమిక్ సిచ్యుయేషన్లో 100కు పైగా థియేటర్స్ లో 50రోజుల వేడుక జరుపుకుంది అఖండ. 200 కోట్ల వసూళ్లను సాధించి, అటు బాలయ్య అభిమానులకు, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీకి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

Mahesh Babu: దర్శకుడికి మహేష్ క్షమాపణలు.. ఎందుకో తెలుసా?

ఏ ముహూర్తాన తగ్గేదేలే అన్నాడో గాని, పుష్ప ఎక్కడా తగ్గట్లేదు. కోవిడ్ వేవ్ కు ముందు విడుదలైన పుష్ప బాక్సాఫీస్ దగ్గెర కలెక్షన్ల సునామి సృష్టించింది. అల్లు అర్జున్ బ్రాండ్ ఇమేజ్ ని ఆల్ టైమ్ హై కి చేర్చి, 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది పుష్ప. థియేటర్లోకొచ్చిన 20 రోజులకే ఓటిటిలో పుష్ప స్ట్రీమింగ్ మొదలైనా ఎక్కడా తగ్గకుండా హైయెస్ట్ వ్యూయర్ షిప్ నే సాధించింది. ఓటిటి ఎఫెక్ట్ థియేటర్ వసూళ్లపై పడుతుందని అనుకున్నారు మేకర్స్. కాని, అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ 2021 కలెక్షన్స్ కంటిన్యూ చేస్తూ ఈ కొత్త సంవత్సరంలో కూడా పుష్ప జోరు చూపించింది.

Unstoppable with NBK: ఫినాలే ఎపిసోడ్.. కళ్లు చెమ్మగిల్లేట్టు బాలయ్య వ్యాఖ్యలు!

టాలీవుడ్ లో అఖండ ప్రభంజనం సృష్టిస్తే, బాలీవుడ్ లో పుష్ప సంచలనం సృష్టించాడు 100 కోట్ల గ్రాస్ కలక్షన్స్ క్రాస్ చేసి, అక్కడి సూపర్ స్టార్లనే ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 50 రోజుల థియేట్రికల్ రన్ కి 365 కోట్ల వసూళ్లు రాబట్టి, మొత్తం సీన్ మార్చేశాడు. ఇండస్ట్రీలో విడుదలకు రెడీ అవుతున్న భారీ బడ్జెట్ సినిమాలకు బాలయ్య బాబు అఖండ, బన్నీ పుష్స సినిమాలే ఇప్పుడు ఆదర్శంగా కనిపిస్తున్నాయి.