Sohel : ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు.. మూడో సినిమా షూట్ మొదలుపెట్టిన సోహెల్..

 బిగ్ బాస్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న సోహెల్ తర్వాత సినిమాలతో బిజీ అయ్యాడు. ఇప్పటికే ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. రూప కొదువయూర్ తో కలిసి సోహెల్.......

Sohel : ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు.. మూడో సినిమా షూట్ మొదలుపెట్టిన సోహెల్..

Sohel

Sohel :  బిగ్ బాస్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న సోహెల్ తర్వాత సినిమాలతో బిజీ అయ్యాడు. ఇప్పటికే ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. రూప కొదువయూర్ తో కలిసి సోహెల్ నటిస్తున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా త్వరలో రిలీజ్ అవ్వనుంది.

ఇటీవల ‘వకీల్ సాబ్’ ఫేమ్ అనన్య నాగళ్ళతో కలిసి సోహెల్‌ ‘బూట్‌కట్‌ బాలరాజు’ అనే సినిమాని ప్రకటించారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా మరో సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేసాడు సోహెల్. సోహెల్ హీరోగా మరో కొత్త సినిమా ప్రారంభమైంది.

Lata Mangeshkar : గాన గంధర్వుడు, గాన కోకిల.. బాలు, లతాల మధ్య అనుబంధం..

కాకతీయ ఇన్నోవేటివ్స్, దొండపాటి సినిమాస్‌ సంస్థల కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఇవాళ ఉదయం యాదాద్రిలో జరిగింది. సోహైల్, చిత్రనిర్మాతలు, దర్శకుడు ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికి ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే మూడో సినిమా కూడా మొదలు పెట్టేసాడు సోహెల్. దీంతో సోహెల్ క్రేజ్ ఇంకా బాగానే ఉంది అని తెలుస్తుంది. ఇదే స్పీడ్ మెయింటైన్ చేసి భవిష్యత్తులో సోహెల్ మరిన్ని సినిమాలు ఓకే చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.